Idream media
Idream media
అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు అనేక హామీలును ఇస్తాయి. మాటల్లో చెప్పిన ఆ హామీలను పేపర్‌పై పెట్టి.. మేనిఫెస్టోలను విడుదల చేస్తాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలను అమలు చేసిన వారికి ప్రజలు మళ్లీ పట్టం కడతారు. లేని వారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది అదే. 2014 ఎన్నికల్లో 600కుపైగా హామీలను చంద్రబాబు ఇచ్చారు. జనసేన, బీజేపీ పొత్తులో అధికారంలోకి వచ్చారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఇంటికొక ఉద్యోగం.. అది ఇచ్చే వరకు నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ.. యువత ఓట్లను కొల్లగొట్టింది.
అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేశారు. ఇంటికొక ఉద్యోగం అటకెక్కింది. ప్రతిపక్షాలు, యువత హామీని గుర్తు చేస్తే.. తాను ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని అనలేదంటూ మాట మార్చారు. ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తామంటూ.. జాబ్ మేళాలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉందనగా.. తూ తూ మంత్రంగా నిరుద్యోగ భృతి ఇచ్చి.. మమ అనిపించారు. ఇప్పుడు ఈ విషయం గుర్తు చేసుకునే పరిస్థితిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు కల్పించారు.
Also Read : కప్పట్రాళ్ల వెంకటప్ప హత్య కేసు ఖైదీలకు బెయిల్
వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై అచ్చెం నాయుడు విమర్శలు చేస్తూ.. వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చూసింది.. పది వేల ఉద్యోగ ఖాళీలేనా..? అంటూ ప్రశ్నించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి.. మాట తప్పారంటూ ఆరోపించారు. రెండేళ్లలో కోటి మంది ఉపాధి పోగొట్టారంటూ విమర్శలు చేశారు అచ్చెం నాయుడు. ఇలాంటి విమర్శలు చేసే.. అచ్చెం నాయుడు చర్చకు తెర తీశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న హామీ ఎవరు ఇచ్చింది..? అచ్చెం నాయుడుకు గుర్తులేనట్లుగా ఉంది. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. ప్రధాన హామీల్లో ఇంటికొక ఉద్యోగం కనిపిస్తుంది. ఈ హామీ జగన్ ఇచ్చారా..? లేదా..? తెలుసుకోవాలంటే.. 2019 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే సరిపోతుంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో లభించే అవకాశం లేదు.. కానీ వైసీపీ మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, వైసీపీ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంది.
అలవిగాని హామీలను వైఎస్ జగన్ ఇవ్వలేదని.. రెండేళ్ల పాలన చెబుతోంది. పట్టణాల్లో ప్రతి నాలుగు వేల మందికి ఆరుగురు, గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి 10 మంది ఉద్యోగులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వైఎస్ జగన్ నియమించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.21 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. సచివాలయాలను ప్రభుత్వ కార్యాలయాలుగా, అందులో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా టీడీపీ నేతలు గుర్తించడం లేదోమో గానీ.. ఆ ఊసే ఎత్తడం లేదు. వైఎస్ జగన్ ఉద్యోగాలు కల్పించారో లేదో.. సచివాలయాలకు వెళితే ఇట్టే తెలుస్తుంది. మరి ఆ పని అచ్చెం నాయుడు చేయగలరా..?
Also Read : నాడు విద్యావేత్త.. నేడు మోసగాడు..