iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్‌స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నిర్వహణకు సంబంధించి లైసెన్సుల పొడిగింపునూ ఆమోదించారు.