iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు పోలీసు అధికారుల సంఘం స్ట్రాంగ్ రిప్లై

చంద్రబాబుకు పోలీసు అధికారుల సంఘం స్ట్రాంగ్ రిప్లై

డీజీపీ గౌతం సవాంగ్ క్రైస్తవుడు, సీఐడీ అధిపతి సునీల్ కుమార్ కూడా క్రైస్తవుడే. ఇంకా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కూడా క్రిష్టియన్ ఇక వీళ్ళ దర్యాప్తులో తేలేది ఏం లేదు.. అంతా వట్టిదే అంటూ రామతీర్థం ఘటనపై ఇష్టామసారం నోరుపారేసుకున్న చంద్రబాబుకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం గట్టిగా సమాధానము ఇచ్చింది. తాము కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తుంటామని, తమకు రాజకీయాలను అంటించవద్దని సంఘం చంద్రబాబుకు సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము పోలీసు విధుల్లో చేరినరోజే కులమతాలకు అతీతంగా ప్రజా సేవల్లో ఉంటామని ప్రమాణం చేస్తామని అలాంటి తమను రాజకీయ లబ్దికోసం దూషించడం తగదని సూచించింది. దసరాకు చేసే ఆయుధపూజలో కులమతాలకు అతీతంగా పోలీసులు అందరూ పాల్గొంటారని, రంజాన్ సమయంలో నిర్వహించే కార్య కమంలోనూ క్రిస్మస్ వేడుకల్లో తామంతా సోదర భావంతో పాల్గొంటామని వివరించారు.

నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఓ నాయకుడు ఇతర రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తూ ఇలాంటి కామెంట్లుచేయడం తగదని సూచించారు. నలభయ్యేళ్ల రాజకీయ జీవితంలో ఆయన నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో తామంతా ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేశామని, ఈ క్రమం లో 14000 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారని, దాదాపు 109 మంది ప్రాణాలు విడిచారని, అలాంటి కార్య దీక్షాపరులకు దురుద్దేశాలు ఆపాదించడం తగదని పోలీసు సంఘం చంద్రబాబుకు సూచించింది.

మొత్తానికి రాజకీయ నైరాశ్యంలో ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ తో బాటు అధికారపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరకు ప్రభుత్వంలోని కింది స్థాయి ఉద్యోగి అయిన గ్రామ వాలంటీర్ల పైన కూడా నోరు పారేసుకుంటున్నారు. బీజేపీకి దూరమయ్యాక నానా ఇబ్బందులు, కోర్టు కేసులు ఎదుర్కొంటూ భయంతో బిక్కుబిక్కుమంటున్న చంద్రబాబు ఇప్పుడు రామతీర్థం ఘటన మాటున హిందూ ఉద్డారకుడిగా ఫోజులిస్తూ బీజేపీకి దగ్గరయ్యేందుకు శతథా యత్నిస్తున్నారు ఈ క్రమంలోనే పోలీసులకు సైతం మతాన్ని అద్ది పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దీన్ని సహించలేని పోలీస్ అధికారులు చంద్రబాబుకు గట్టి సమాధానం ఇచ్చారు