ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారి సమీర్ శర్మ ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం పాటు ఎపిలోను, ఆ తర్వాత కేంద్ర స్థాయిలోను సమీర్ శర్మ కీలక బాధ్యతలు నిర్వహించారు. కొద్ది నెలల క్రితమే ఆయన మళ్ళీ కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఆదిత్యనాధ్ దాస్ స్థానంలో కొత్తగా ప్రధాన కార్యదర్శి హోదాలో నియమితులయ్యారు. ఆయన అక్టోబర్ 1 నుంచి సీఎస్ హోదాలోకి వస్తారు.
ప్రస్తుతం సీఎస్ గా ఉన్న ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం మొన్నటి జూన్లో ముగిసింది. ఆ తర్వాత ఆరు నెలల పదవీకాలం పొడిగింపు కోసం ఏపీ ప్రభుత్వం కోరింది కేంద్రం మాత్రం మూడు నెలల పొడిగింపునకు అనుమతినిచ్చింది. దాంతో ఆయన సెప్టెంబర్ వరకూ పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అదిత్యానాధ్ దాస్ స్థానంలో సమీర్ శర్మ నియామకం ఆసక్తిగా మారింది.
నవంబర్ 11, 1961లో జన్మించిన సమీర్ శర్మ ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్లానింగ్ విభాగంలో ఉన్నారు. ఆయన నవంబర్ వరకూ సీఎస్ గా కొనసాగుతారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆయన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏపీలో ప్రస్తుతానికి సీనియర్ అధికారుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎమ్మెస్సి, పిహెచ్డి చేశారు. సీఎస్ సీటు కోసం చాలామంది పోటీ పడినా జగన్ మాత్రం ఆయన వైపు మొగ్గు చూపడం ఆసక్తికరం.
Also Read:రమ్య కుటుంబం పట్ల జగన్ మరింత ఔదార్యం