రమ్య కుటుంబం పట్ల జ‌గ‌న్ మ‌రింత ఔదార్యం

By Kalyan.S Sep. 10, 2021, 08:15 am IST
రమ్య కుటుంబం పట్ల జ‌గ‌న్ మ‌రింత ఔదార్యం

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరు నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఏదైనా ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు స్పందిస్తున్న తీరులోనూ, బాధిత కుటుంబాల‌ను ఆదుకోవ‌డంలోనూ ఆయ‌న స్పంద‌న అభినంద‌నీయం. సాయం చేస్తే చాల‌దు.. ఆ కుటుంబానికి స‌రైన అండ‌, ఓదార్పు అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఆదుకున్న తీరు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకునేలా చేసింది. గత నెలలో గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో ర‌మ్య హత్యకు గురైన వెంట‌నే స్పందించిన జ‌గ‌న్ బాధితుల‌ను త‌క్ష‌ణం అరెస్టు చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అంతేకాకుండా.. త‌క్ష‌ణ సాయంగా రమ్య కుటుంబానికి రూ.10లక్షల చెక్కును హోంమంత్రి సుచరిత ద్వారా అంద‌జేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ఇప్పుడు మ‌రింత ఔదార్యాన్ని చాటారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రమ్య కుటుంబ సభ్యులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రమ్య హత్యోదంతాన్ని జగన్‌కు వివరించారు. ఆ కుటుంబం పరిస్థితి పట్ల జగన్ సానుభూతి వ్యక్తం చేశారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప‌ది రోజుల్లో అపాయింట్‌మెంట్ లెటర్ ఆమెకు అందాలని అధికారులకు సూచించారు. అంతేకాదు,రమ్య కుటుంబానికి ఐదెకరాల పొలం,ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Also Read:లోకేష్ కి గతం గుర్తు చేయాలి..!

ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ ప్ర‌య‌త్నించారు. ఆమె కుటుంబాన్ని ప‌రామ‌ర్శించే పేరుతో చేసిన హ‌డావిడి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం స్పంద‌న స‌రిగా లేదంటూ ఆందోళ‌న‌కు దిగారు. అయితే.. దీనిపై నిజానిజాలు ప‌రిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం చెప్పిన విష‌యాలు విని టీడీపీకి మైండ్ బ్లాక్ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరును కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్డర్‌ ప్రశంసించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా ఏపీ ప్రభుత్వం వెంటనే అందించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ దృక్పథం చాలా పాజిటివ్‌గా ఉందని, దేశం మొత్తం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఇటువంటి ఘ‌ట‌న‌పై ఓ జాతీయ స్థాయి క‌మిష‌న్ ఇలా స్పందించ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ మైలేజీని పెంచింది.

అయితే, ఇప్ప‌టికి కూడా దీన్ని లోకేశ్ రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా రెండు రోజుల క్రితం ఈ ఘటనపై ట్విట్టర్‌లో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'ఇంకా 3 రోజులే మిగిలాయి దళిత బిడ్డ రమ్యని దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపిన వాడికి ఉరి వేసేది ఎప్పుడు? ' అని లోకేష్ పేర్కొన్నారు. లోకేశ్ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దోషులకు 21 రోజుల్లో శిక్ష పడేలా రూపొందించిన దిశ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేసే విధంగా టీడిపి ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.

Also Read:పోలవరం ప్రాజెక్టులో మరో ముందడుగు , పూర్తయిన గ్యాప్ 3 డ్యామ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp