iDreamPost
iDreamPost
ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎన్నికల కమిషన్‌కు అలవాటుగా మారిందని, ఇది మంచి పద్దతి కాదని ప్రభుత్వం ఏ విషయంలో సహకరించడం లేదు? ఎలాంటి సహకారం కావాలి? అనే విషయాలను నిర్దిష్టంగా చెప్పకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందడం లేదు? ఏ రకమైన సహకారం కావాలి? అనే అంశాలను వివరిస్తూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని నిమ్మగడ్డను ధర్మాసనం ఆదేశించింది
ఇది ఇలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ తన నివాసంలో అదనపు అటెండర్లను కేటాయించాలని, అలాగే హైదరాబాద్ లోని తన నివాసాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారిక నివాసంగా ప్రకటించాలని హై కోర్టుని కోరారు. ఈ విషయంలో ధర్మాసనం నిమ్మగడ్డ రమేష్ అభ్యర్ధనపై తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా పనిచేసే మీకు విజయవాడలో ఆఫీసు ఉండగా.. హైదరాబాద్‌లో సకల హంగులతో కూడిన మరో ఆఫీసు దేనికి ? ఇది ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని నిమ్మగడ్డ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.