iDreamPost
android-app
ios-app

విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హై కోర్టులో ఏజీ వాదనలు

  • Published Oct 06, 2020 | 2:24 PM Updated Updated Oct 06, 2020 | 2:24 PM
విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హై కోర్టులో ఏజీ వాదనలు

రాజధాని వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరం కాపులుప్పాడ ప్రాంతంలో స్టేట్ గెస్ట్ హోస్ నిర్మాణానికి భూమి కేటాయించిన విషయం తెలిసిందే . అయితే పరిపాలనా వికేంద్రికరణ అంశం కోర్టు పరిదిలో ఉండగా విశాఖలో ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మాణం పేరున భూమి ఎలా కేటాయిస్తారు అంటూ గతంలో కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇది ఇలా ఉంటే ఆంద్రప్రదేశ్ లో అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రోజు వారీ విచారణ ప్రారంభం అయిన నేపధ్యంలో పలు కీలక అంశాలపై వాదనలు జరిగాయి. వీటిలో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం పై దాఖలైన పిటిషన్ పై కూడా దర్మాసనం విచారణ చేపట్టింది.

విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని సమర్ధిస్తు అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ నేపద్యంలో జోక్యం చేసుకున్న దర్మాసనం పరిపాలన వికేంద్రీకరణ బిల్లు రాకముందు ఇటువంటి క్యాంపు కార్యాలయాలు ఉన్నయా అని ప్రశ్నించగా. అడ్వకేట్ జనరల్ శ్రీరాం సమాధానం ఇస్తూ గతంలో కూడా చంద్రబాబు తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో, హైద్రబాద్ లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు.

అయితే దీనికి సంబందించిన వివరాలుతో పూర్తి స్థాయి అఫిడెవిట్ దాఖలు చేసేందుకు దర్మాసనాన్ని ఏజీ గడువు కోరగా తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.