ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కోరిక సహజం.. మనిషి బ్రతికేదే కూడు, గూడు, గుడ్డ కోసం.. మౌలిక అవసరంగా ఇల్లు అనేది అందరికీ ఉండాల్సిందే. ఇప్పటికే పేదలకు 30.75 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మధ్యతరగతి వారికి ఉద్యోగులకు సైతం ఇంటి కలను నెరవేర్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
తక్కువ ధరకే వెంచర్
మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లస్థలాలు అందించే పథకం లో భాగంగా మొదటి విడతలో 12 పట్టణాల్లో 18 లే అవుట్ల ను ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గుర్తించిన పట్టణాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన కనీసం 25 నుంచి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో మార్ట్ టౌన్ల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇవి అచ్చం అర్బన్ ఏరియా టౌన్ షిప్ మాదిరి ఉండేలా ప్రభుత్వమే దగ్గరుండి చర్యలు తీసుకోనుంది. అనువుగా ఉన్న భూమి గుర్తించిన వెంటనే వెంచర్ వేసి దానిని పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దేందుకు 18 నెలల సమయం ప్రభుత్వం ఇవ్వనుంది.
భూములు ఇచ్చిన వారికి ప్రత్యేకం
మధ్యతరగతి వారికి ప్రభుత్వమే లేఅవుట్లు వేసి స్థలాలు ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో దానికి తగిన ప్రైవేట్ భూములు ఇచ్చేవారికి తగిన లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. వారికి వెంచర్లో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదా మరోచోట మార్కెట్ ధర పలికే ఎక్కువ వచ్చేలా ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడమో చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించబోయే టౌన్షిప్ లలోనూ ఎలాంటి సౌకర్యాల కొరత లేకుండా పూర్తి స్థాయి ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉండాలని జగన్ ఆదేశించారు.
ఎప్పుడు అర్జీ పెట్టుకున్న స్థలం
అర్హులైన పేదలు తమ ఇంటి స్థలం కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకున్నా ఇచ్చేలా ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకు రాబోతున్న మధ్యతరగతి వారి స్థలాల విషయంలోనూ అదే పద్ధతి పాటించాలని భావిస్తోంది. మధ్యతరగతి వారికి తక్కువ ధరకే స్థలాలు ఇచ్చేలా వారి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే మంచిది అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ దీనికోసం ఒక ల్యాండ్ బ్యాంక్ను సిద్ధం చేసుకోవాలని అధికారులకూ ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎలాంటి వివాదాలు కోర్టు కేసులు లేని స్థలాలను మాత్రమే చూడాలని, ప్రభుత్వం వద్ద స్థలం తీసుకున్న మధ్యతరగతి వారు పూర్తిగా సంతృప్తి చెందేలా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే దీనిలో భాగంగా కార్యాచరణ సిద్ధమైంది. ఇక మిగిలింది మధ్యతరగతి వారికి ఇంటి వైభోగమే.