iDreamPost
android-app
ios-app

AP government, Movie Tickets – ఆన్ లైన్ టికెటింగ్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

AP government, Movie Tickets – ఆన్ లైన్ టికెటింగ్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల కోసం జీవో నెం 142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్ల విక్రయాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఇకపై అన్ని సినిమా టికెట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని ఈ జీవోలో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపునే ఒక వెబ్సైట్ కూడా డిజైనింగ్ జరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోని ఐఆర్సీటీసీ తరహాలో ఆన్‌లైన్‌ మూవీ టికెట్ల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ (APFDC)కి అప్పగించింది. త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపింది. ఒకరకంగా బుక్ మై షో, పేటీఎం లాంటి ఆన్‌లైన్ యాప్స్‌కి ఈ జీవోతో చెక్ పెట్టినట్టు చెప్పాలి.

ఇక తాజా అప్డేట్ ప్రకారం ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సినిమాను బట్టి టికెట్ రేటును నిర్ణయిస్తుందని జీవోలో పేర్కొంది. థియేటర్స్ మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన అడ్మిషన్ రేట్స్‌ ప్రకారం ట్యాక్స్ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఆయా థియేటర్స్ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపింది. ఈ విధానానికి ఏపీ ఫిలిం ఛాంబర్ అంగీకరించినట్లు జీవోలో తెలిపింది ఏపీ సర్కార్. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను ఆన్ లైన్ లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే సినిమా టికెట్స్ అమ్మాలని స్పష్టం చేసింది.

టికెట్ ధరల తగ్గింపు విషయంలో కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని కొందరు పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగ్గా హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సినిమా టికెట్ల ధరలను ఇష్టారీతిలో పెంచుకొనే విధానానికి తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. థియేటర్ యాజమాన్యాలు పెంపు ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని చెప్పింది. టికెట్‌ ధరలపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Also Read : ఏపీ థియేటర్లకు బి ఫారమ్‌ టెన్షన్.. లేకుంటే సీజే!