కర్షకులకు, ప్రజలకు మేలు చేసే విషయంలో ఎప్పుడూ ఉన్నతమైన నిర్ణయాలు తీసుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన ఆలోచనలకు ప్రతిరూపం నుంచి మరో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. పెరుగుతున్న ధరలు, మధ్యవర్తుల కమీషన్లు నిలువరించేలా ప్రజలందరికీ అందుబాటులో జనతా బజార్లను రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మొదలు పెట్టేందుకు వై.ఎస్. జగన్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ బజార్లలో సాధారణ ప్రజలకు కావలసిన అన్ని లభిస్తాయి. కాయగూరల దగ్గరనుంచి ఇంట్లోని సామాను వరకూ ప్రతిదీ ఇక్కడ లభించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వినియోగ దారుడుకు బయట మార్కెట్లో దొరికే ధర కంటే తక్కువకు జనతా బజార్ లో నాణ్యమైన సరుకులు, వస్తువులు అందేలా ప్రభుత్వం చొరవ తీసుకొని ఉంది.
జనాభాను బట్టి విస్తీర్ణం
రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఏర్పాటు కాబోతున్న జనతా బజార్ లను ఆయన నగరాలు పట్టణాలు గ్రామాల వారీగా ఏర్పాటు చేయనున్నారు. అక్కడి జనాభా ఆధారంగా బజార్ యొక్క విస్తీర్ణం ఎంత ఉండాలి అనేది కూడా నిర్ణయిస్తారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకూ ఈ బజార్లు వెలిశాయి. మొదటి దశలో 5 వేల జనాభా పైబడి ఉన్న గ్రామాల్లో వీటికి ప్రత్యేకమైన భవనాలను నిర్మించి అక్కడ బజార్లను ప్రారంభించబోతున్నారు. రైతు తాను పండించిన పంటకు కనీస ధరను పొందుతూ వినియోగదారుడికి అధిక మొత్తంలో అమ్మకుండా సాధారణ లాభం పొందేలా ఇక్కడ పలు రకాల వస్తువులు సరుకులు అందుతాయి. దీనిపై త్వరలోనే జిల్లా స్థాయి అధికారులకు ఎక్కడెక్కడ జనతా బజార్ లో ప్రారంభించడానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి అక్కడ ప్రత్యేకమైన నిర్మాణాలను చేసి వీటిని ప్రారంభించనున్నారు.
ఆయా గ్రామాల సరకు అక్కడే!
గ్రామాల్లో పండించే పంటలను ఎవరికో ఇచ్చుకోకుండా, మధ్యవర్తుల ప్రమేయం నిలువరించి ఆయా గ్రామాల్లో పండించే పంటలు అక్కడే అమ్ముకునేలా ఈ జనతా బజార్ లు సహకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు ఒక గ్రామంలో పండించిన పంట ఆ చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్లేందుకు తగిన రవాణా ఏర్పాట్లను అధికారులు చేస్తారు. దీని వల్ల పంట ఎక్కడా పాడవడం కానీ, కనీస ధర లేదన్న మాటగానీ లేకుండా అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. జనతా బజార్ లో అమ్మే వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారుల వద్ద నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తారు.
ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించాలని భావిస్తున్న ఈ జనతా బజార్లు విషయంలో జిల్లా అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టాలని పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామాల్లో జనతా బజార్ లకు అనువైన స్థలాన్ని గుర్తించి వెనువెంటనే నిర్మాణాలు పూర్తి చేసేలా జగన్ సూచనలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రైతు బజార్లు కాన్సెప్ట్లో పెద్ద పట్టణాల్లోనే ఇవి ఉండడం కనిపించింది. గ్రామీణ స్థాయి వినియోగదారుడికి సైతం అతి తక్కువ లోనే కూరగాయలు ఇతర వస్తువులు అందేలా చూడడమే జనతా బజార్ ల కాన్సెప్ట్. ఇది కనుక విజయవంతమైతే గ్రామీణ స్థాయిలో సైతం అతి తక్కువ కె అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.