iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం మరోసారి గానగంధర్వుడికి తగిన గౌరవం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీబీ సొంత ప్రాంతం నెల్లూరులో సంగీత కళాశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు ఖరారు చేశారు. నెల్లూరు నగరంలో ఉన్న మ్యూజిక్, డ్యాన్స్ పాఠశాలకు ఎస్పీబీ పేరుని ఖారు చేయడం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ కుటుంబీకులు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సినీ నేపథ్య గాయకుల్లో బాలసుబ్రహ్మణ్యం కీర్తి అంతా ఇంతా కాదు. ఆయన మరణం సందర్భంగా ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగా స్పందించింది. స్వయంగా మంత్రి అనిల్ కుమార్ చెన్నై వెళ్లి నివాళులర్పించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రభుత్వం దానికి అనుగుణంగా వ్యవహరించింది. ఆ తర్వాత బాలుని తగిన విధంగా గౌరవిస్తామని ప్రకటించింది.
ఎస్పీ బాలు తన ప్రారంభ దినాల్లో నెల్లూరులో జీవనం సాగించారు. నెల్లూరు జిల్లాతో ఆయనకు అవినాభౄవ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసుడి సేవలకు గుర్తిపు సంగీత , నృత్య పాఠశాలకు ఆయన పేరుని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిరకాలం ఆయనకు తగిన రీతిలో గుర్తింపు దక్కినట్టుగా బాలు అభిమానులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కి బాలు తనయుడు ఎస్పీచరణ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి, జగన్ కి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. తన తండ్రికి తగ్గిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు.