ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు 20 అంశాలతో కూడిన అజెండాపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇసుక కొరత, ధరల సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలుకు కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.