ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అభివృద్ధి పనులతోపాటు నూతన సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి అనుగుణంగా అమరావతిపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు అవరమైన 3 వేల కోట్ల రూపాయలను ఎంఆర్‌డీఏ సేకరించేందుకు వీలుగా బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా అగ్రవర్ణ పేదల్లోని 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేల చొప్పన మూడేళ్లలో 45 వేల రూపాయలు ఇవ్వనున్నారు.
– కడప జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపిక.
– కాకినాడ ఎస్‌ఈజెడ్ పరిధిలోని ఆరు గ్రామాల తరలింపునకు మినహాయింపు. తద్వారా రైతులకు 2,180 ఎకరాలు వెనక్కి ఇచ్చేందుకు నిర్ణయం. కమిటీ చూసించిన దాని కంటే భూములకు ఎక్కువ నష్టపరిహారం అందజేత.
– పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు లోపు ఉన్న టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించేందుకు నిర్ణయం.
– నవరత్నాల అమలుకు క్యాలెండర్ విడుదల. ఏప్రిల్ నుంచి వచ్చే జనవరి వరకు ఏ నెలలో ఏఏ పథకాలు అమలు చేస్తారో క్యాలెండర్‌లో వెల్లడి.
– విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం.
15967