iDreamPost
iDreamPost
ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకుందా సార్..
వారి ముందు నేను చాలా చిన్నవాణ్ణి..
వారొచ్చి నా పక్కన నిల్చుంటే నేనేం మాట్లాడగలను..
… సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతాను కానీ.. ప్రతిపక్ష నేతే నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్..
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు స్థానికి పక్క వరుసలో కుర్చునే సీనియర రాజకీయనాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి తాను చంద్రబాబు పక్కన నిలిచి మాట్లాడలేనని,తన స్థానాన్ని మార్చమని స్పీకర్ ను కోరుతూ చేసిన వాఖ్యలు ఇవి .
Also Read : ఆనం పేల్చిన నెల్లూరు మాఫియా బాంబు!
ఈ ఉదయం శాసనసభ సమావేశాలు మొదలైన తరువాత పీపీఏలపై చర్చలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు. వైసీపీ సభ్యులను అరాచకశక్తులంటూ విమర్శలు చేశాడుచంద్రబాబు తీరు మీద దుమారం రేగింది. వైసీపీ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరాచకశక్తులంటూ ఆయన పేర్కొన్న తీరుపై అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఆవ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతుండగా పక్క బెంచీలో ఉన్న చంద్రబాబు లేచి, తన వైపు రావడాన్ని ఆనం తీవ్రంగా తప్పుబట్టారు. తన సీటు మార్చాలని, లేకుంటే విపక్ష నేతను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. అదే అంశంపై అంబటి రాంబాబు మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రవర్తనను సీరియస్ గా తీసుకోవాలన్నారు. అలాంటి తీరుని సహించకూడదన్నారు. పిల్లకాయలా వ్యవహరించకూడదన్నారు. స్పందించిన స్పీకర్ అరాచకశక్తులు అనే మాటను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు
Also Read : వైసీపీలో ధిక్కార స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి…!