ఏపీ ప్రభుత్వ దూకుడు కొనసాగిస్తోంది. అవినీతి, అక్రమాల పైవెనక్కి తగ్గకూడదని నిర్ణయం స్పష్టమవుతోంది. అమరావతి.అంశంపై అక్రమాలు, అవినీతి విషయమై విమర్శలతో కాకుండా వాస్తవాలు వెలికితీసేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. కొనసాగింపుగా సిట్ నియమించారు. తాజాగా ఏసీబీ రంగంలో దిగింది. టీడీపీ కొంపలో కలకలం రేపుతోంది. మాజీ అడ్వొకేట్ జనరల్ మీద కేసు నమోదు తో ఈ పరంపర ఎక్కడికి దారితీస్తుందోననే బెంగ టీడీపీ నేతల్లో మొదలయ్యింది. చివరకు ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన గత ప్రభుత్వ పెద్దలను కలచివేస్తోంది.
విచారణ కి టీడీపీ అడ్డుపుల్ల
అమరావతి రాజధాని విషయం లో అక్రమాలు లేవని టీడీపీ బుకాయిస్తోంది. కానీ నిజంగా విచారణ చేస్తే ముప్పు తప్పదని ఉలిక్కిపడుతోంది. నిజానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అపొజిషన్ లో ఉన్నప్పుడే జగన్ ఈ విషయం బయటపెట్టారు. అధికారంలోకి రాగానే దృష్టి సారించారు. అయినా టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. దమ్ముంటే విచారణ చేసి నిరూపించాలని ఓ వైపు సవాల్ చేస్తారు. రెండోవైపు విచారణ అంటూ సాగితే అసలు బండారం వెలుగులోకి వస్తుందనే వణుకు మొదలైంది. దాంతో రెండు నాలుకలు ధోరణి బయటపెట్టేసింది.
అంతటితో ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి అక్రమాలను వెల్లడించే విచారణకు అడ్డుపుల్ల వేస్తోంది. ఇప్పటికే సిట్ ని అడ్డుకోవాలంటూ హైకోర్టు ని టీడీపీ శిబిరం ఆశ్రయించిన తీరు అందుకు తార్కాణం. చివరకు ఎటువంటి కేసు లేకుండానే తనను అరెస్ట్ చేయకుండా నిరోధించాలని మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు ని ఆశ్రయించడం అందులో భాగమే.
ఏసిబి కేసులో తీగ లాగితే డొంక కదులుతుందా?
ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు కావడంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు తహశీల్దార్లు, రిజిస్ట్రార్లు ఈ కేసులో ఇరుక్కున్నారు. వారందరినీ విచారించిన అధికారులకు పలు ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా కేసులో పురోగతి వైపు పయనిస్తోంది. ఆ క్రమంలో అమరావతి భూ కుంభకోణంలో పాత్రధారులు గా దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరో 12మందిపై ప్రివెన్షన్ కరెప్షన్ 409, ఐపీసీ 420 రెడ్ విత్ 120-B సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
చంద్రబాబు హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా ఉన్న దమ్మాలపాటి అధికారిక హోదాలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డట్టు సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ ఓ అడుగు వేసింది. 2014లో మామ, బావమరిది పేర్లతో భూములు కొన్న దమ్మాలపాటి 2015, 2016లో అవే భూములు తను, తన భార్య పేర్లపై బదలాయింపు చేసుకున్న రికార్డుల ఆధారంగా కేసు బనాయించింది. ఈ భూములను సీఆర్డీఏ కోర్ క్యాపిటల్ పరిధిలో ఉండేలా కొనుగోలు చేసిన దమ్మాలపాటి అడ్డంగా దొరికినట్టు కనిపిస్తోంది. అదే ఇప్పుడు టీడీపీ నేతలను కలవర పెడుతున్న అంశం.
ఆ దారిలో చాలా మంది ఉన్నారు..
రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు కొందరు. అసైన్డ్ ల్యాండ్స్ తమ పేరుతో రాయించుకుని ప్రయోజనాలు కాజేసిన వాళ్ళు ఇంకొందరు. వారితో పాటుగా లంక భూములు, ఇతర భూములను కొల్లగొట్టిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి అనేకమంది జాబితా ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్దకు చేరింది. కూపీ లాగితే కీలక నేతల బండారం బయటపడబోతోంది. అదే బాబు బ్యాచ్ ని భయపెడుతోంది.
కొంతకాలంగా రాజధాని కోసం అంతగా పట్టుబట్టడానికి, ఇప్పుఫు కేసులు ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి కారణం అదేనని ఇట్టే అర్థం అవుతోంది. జగన్ పట్టుదల మూలంగా బాబు బండారం బయటపడే రోజు ఎంతో దూరంలో లేదని పలువురు భావిస్తున్నారు. అందుకే బాబు సర్వశక్తులు ఒడ్డి ఈ విచారణ ముందుకెళ్లకుండా చూడాలని అసిస్తున్నారు. ఏం జరుగుతుందో అసక్తిదాయకమే.