బాహుబలి సినిమా లో హీరో ప్రభాస్ పక్కన రాణి గా మెప్పించిన అనుష్క. ఈసారి ప్రేక్షకుల ముందుకు ‘భాగమతి’ సినిమా లో ప్రధాన పాత్ర పోషించి అందరి మన్ననలు అందుకుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొట్ట మొదటి విజయం కైవసం చేసుకుంది అనుష్క. ప్రస్తుతం ఈ సినిమా అన్నిచోట్లా సక్సెస్ ఫుల్ గా లాభాలు సాధిస్తుంది. భాగమతి సినిమా ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూలు రాబట్టింది. గతంలో అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ యూస్లో 9.71 లక్షల డాలర్లను వసూలు చేయగా ‘భాగమతి’ దాన్ని క్రాస్ చేసి ఇప్పటికి 9.80 లక్షల డాలర్లను సాధించి దక్షిణాది సినిమా చలనచిత్ర రంగంలో ఏ హీరోయిన్ కి రాని కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. భాగమతి మొదటివారం రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.
ఇదే ఊపుతో కలెక్షన్లు మరింత రాబట్టేందుకు… ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు ఫస్ట్ టైం అనుష్క సక్సెస్ టూర్ చేపట్టనుంది. ఈ సక్సెస్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్యాన్స్ ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. టాప్ హీరోలకు ఏ విధంగా వెల్ కమ్ చెబుతారో అనుష్క కు కూడా అదే విధంగా ఏర్పాట్లు చేయడం విశేషం. మొత్తంగా అనుష్క కొత్త ట్రెండ్ సృష్టించింది.