ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఒకే ఒక లక్ష్యం మినహా కొందరికి మరో లక్ష్యం లేదన్నది ప్రతి ఒక్కరికి బహిరంగంగా తెలిసిన రహస్యం. ప్రభుత్వంపై అపనిందలు వేయడానికి గోతికాడ నక్కల్లాగా ఆ కొందరు ఎదురుచూస్తున్నారు అనేది కూడా మెజారిటీ వర్గాలకు తెలిసిన విషయమే. కానీ ఆ కొందరు తమకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాస్త ప్రజల్లో ఉన్న వ్యతిరేకతగా చూపించడానికి యెల్లో మీడియా ద్వారా చేయని ప్రయత్నాలు లేవు. అందుకు అనుగుణంగానే సదరు నాయకుల కనుసన్నల్లో రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వంపై బురద జల్లడానికి యెల్లో మీడియా మరియు కొన్ని న్యూస్ ఛానెళ్లు రెడీగా ఉంటాయి.
సున్నితమైన విషయాల్లో ఆచితూచి వ్యవహిరించడం అనేది నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుల లక్షణం. కానీ రాష్ట్రంలో మత కలహాలు రేపి ఆ మంటల్లో రాజకీయ లబ్ది పొందేందుకు సదరు పెద్ద నాయకులు యెల్లో మీడియా ద్వారా చేయని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రక్రియలో సదరు నాయకులు ఎంచుకున్న తీరు మాత్రం హర్షించదగింది కాదు. మత కలహాలు సృష్టించి వాటి ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ఎదురుచూసిన కొందరికి ముఖ్యమంత్రి జగన్ చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు. అంతర్వేదిలో నరసింహస్వామి రథం దగ్ధం కావడంతో ఆ ఘటన ద్వారా మత రాజకీయాలకు తెరతీసిన కొందరికి బుద్ధి చెప్పేలా ముఖ్యమంత్రి జగన్ రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.
చిన్న ఫేస్బుక్ పోస్ట్ బెంగుళూరు నగరాన్ని వణికించింది.
గత నెల ఆగస్టు 11 వ తేదీన బెంగుళూరులో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు ఒక మతానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన చిన్న పోస్ట్ వల్ల బెంగుళూరు నగరం అట్టుడికిపోయింది. ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టిన కొందరు నిరసనకారులు 11వ తేదీ రాత్రి మొత్తం రణరంగం సృష్టించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులకి గాయాలు కాగా 200 మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి. గొడవలు అడుపులోకి తీసుకురావడానికి పోలీసులు నిరసన కారులపై కాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసుకాల్పుల్లో ముగ్గురు మరణించారు. కేజీ హల్లి, డీజే హల్లి, భారతి నగర్, పులికేశి నగర్, బాన్సవాడి పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. నగరం అంతటా 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేశారు. అత్యంత సున్నితమైన అంశం అయిన మతాల విషయంలో ఒక మతానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం వల్ల యావత్ బెంగుళూరు నగరం అట్టుడికిపోయింది.
ఏపీలో కూడా బెంగుళూరు తరహా అల్లర్లకు కుట్ర.
మన రాష్ట్రంలో కూడా అలాంటి సున్నితమైన అంతర్వేది రథం దగ్ధం విషయంలో కొందరు నాయకులు రాజకీయం చేసి తమ ఎదుగుదలకు వాడుకోవడానికి ప్రయత్నం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాయకులు ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లకు ప్రోత్సహిస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు.? ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ సీబీఐ దర్యాప్తుకు అప్పగించకపోతే సదరు నాయకులు తమ యెల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై ఎంతగా విషం చిమ్మడానికి ప్రయత్నం చేసేవారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. కులం, మతం, ప్రాంతం లాంటి సున్నితమైన విషయాలను కూడా రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటున్న నాయకులు ఎందరో ఉన్నారు. ఇలాంటి సున్నితమైన అంశంలో ప్రజలను రెచ్చగొట్టే నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఒక మతానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందన్న విష ప్రచారం ఇప్పటికే యెల్లో మీడియా ద్వారా ఆ కొందరు నాయకులు ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలను తక్కువ అంచనా వేస్తూ సదరు నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో దాదాపు మరుగున పడిపోయిన పార్టీలు మరియు నాయకులు తమ స్వప్రయోజనాల కోసం చేస్తున్న ఈ నీచ రాజకీయాలకు మరోసారి ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెబుతారన్నది కాదనలేని సత్యం.. ఇకనైనా సదరు నాయకులు తమ పద్ధతి మార్చుకోవడం మంచిదని పలువురు హెచ్చరిస్తున్నారు.
ప్రజలే బుద్ధి చెబుతారు…
ఇలాంటి సున్నితమైన అంశాల్లో సంయమనం పాటించి అల్లర్లు జరగకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ప్రజలు సదరు నాయకులకు హితవు పలుకుతున్నారు. గతంలో హిందూ నాయకులు మాత్రమే గొడవలు చేస్తారని మీటింగ్స్ లో చెప్పుకొచ్చిన ఒక హీరో కం రాజకీయ నాయకుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అంతర్వేది రథం ఘటనను తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోవడం శోచనీయం. చలో అంతర్వేది అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రథం చుట్టూ రాజకీయం చేయాలని ప్రయత్నాలు చేసారు.
ఒకవేళ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో రథం దగ్ధం ఘటనను సీబీఐ దర్యాప్తునకు అప్పగించకపోతే సదరు నాయకులు ఎలాగైనా మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి నీచ రాజకీయాలు చేసేవారనేది కాదనలేని సత్యం. ప్రజాభిమానం చూరగొన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరు నాయకులు చేస్తున్న విష ప్రచారం నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆ నాయకులు తెలుసుకోలేక పోవడం వారి అమాయకత్వంగా చెప్పుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా సదరు నాయకులు గతంలో చేసిన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు,చేసిన పనులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి విలువలు లేని నీచ రాజకీయాలు చేస్తున్న సదరు నాయకులు కళ్ళు తెరిస్తే మంచిదని ఆయా పార్టీల కార్యకర్తలు వ్యాఖ్యానించుకుంటున్నారు. ఇదే పంథా కొనసాగిస్తే వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడటం ఖాయం అన్నది ఆయా పార్టీల మరియు నాయకుల సొంత వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం.