iDreamPost
iDreamPost
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్.. పొద్దున లేస్తే చాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే పని. మాటల్లో విషం.. రాతల్లో విషం.. ‘పచ్చ’పాతం తప్పితే ఇంకోటి ఉండదు. కానీ ఏదో నిక్కచ్చిగా ఉన్నట్లుగా బిల్డప్పు. అమరరాజా అనే ఓ సంస్థ ఏపీ నుంచి వెళ్లిపోతోందని ఆంధ్రజ్యోతి తెగ బాధపడిపోతోంది. టీడీపీ నేత గల్లా జయదేవ్ కు చెందిన సంస్థ కావడమే ఇందుకు కారణం. అమరరాజా సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోయే ప్రమాదముందని రాసిన కథనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్మిక, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టించిందట.
‘బాబూ.. నాయనా.. ఆ సంస్థ వెళ్లిపోవడం కాదు.. మేమే దండం పెట్టి వెళ్లమన్నాం’’ అని ఏపీ ప్రభుత్వం చెప్పింది. పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
కానీ ఆంధ్రజ్యోతి మాత్రం తెగ బాధపడిపోతోంది. అక్కడితో ఆగలేదు.. ‘ఆంధ్రజ్యోతికి భయపడుతున్నారా?’ అంటూ ఒక కథనం వండి వార్చింది. ఈ కథనం ఎందుకయ్యా అంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్లకు ఆంధ్రజ్యోతిని పిలవలేదట. ప్రెస్‌మీట్‌కు ఆంధ్రజ్యోతి వస్తే ఎక్కడ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడ అడ్డంగా దొరికిపోతామో అని భయపడ్డారట. తమకు అనుకూలంగా ఉండేవారిని మాత్రమే పిలిపించుకొని, తాము చెప్పదలుచుకుంది చెప్పి వెళ్లిపోయారట. అంతే కాదు.. తాము చెప్పేది వాస్తవమైతే, సందేహాలకు సమాధానం చెప్పగలుగుతామనే నమ్మకం ఉంటే… మీడియా మొత్తాన్నీ పిలవాలట. ఏం సెప్తిరి.. ఏం సెప్తరి.
ఇప్పుడే కొత్తగా జరిగిందా?మీడియా సమావేశాలకు పిలవడం లేదని తెగ బాధపడిపోతోంది ఆంధ్రజ్యోతి. ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతోందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ సీపీ సమావేశాలకు జ్యోతిని పిలవలేదు. ‘మీరు రావద్దు’ అని జగన్ సహా చాలా మంది నేతలు నేరుగానే చెప్పారు. ఇష్టానుసారం వార్తలు రాసి, బురద జల్లుతున్నారన్న కారణంతో ఆ పత్రికను దూరం పెట్టారు. ఏబీఎన్ చానల్ ను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు రానివ్వలేదు. పాదయత్ర సమయంలో కూడా పచ్చ పత్రిక, చానల్ ను వైసీపీ బహిష్కరించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాపట్ల ప్రాంతంలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేఖరులను “అన్న,మిమ్మలిని బహిష్కారించాం కదా?సరే వచ్చారు కదా కేక్ తిని వెళ్ళండి” అంటూ జగన్ బహిరంగంగానే అన్నాడు.
ఇప్పుడేదో కొత్తగా జరుగుతున్నవ్యవహారం కాదు.. ముందు నుంచి ఉన్నదే. కానీ ఆంధ్రజ్యోతికి అధికార పార్టీ భయపడుతున్నదన్నట్లుగా రాతలు రాయడమే విడ్డూరంగా ఉంది. ఇలాంటి అడ్డగోలు రాతలు రాస్తున్నారు కాబట్టే.. దూరం పెట్టారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నిజానిజాలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చింది రాస్తామంటే ఒప్పుకుంటారా?
నాడు సాక్షిని రానిచ్చారా? అప్పుడు ఎందుకు అడగలేదు?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ సమావేశాలు, ప్రెస్ మీట్స్ కి సాక్షిని రానిచ్చే వారు కాదు. సమాచారమిచ్చే వాళ్లు కాదు. కొన్నిసార్లు టీడీపీ నేతలు దాడులు చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడేదో తమను మీడియా సమావేశాలకు పిలవడం లేదని, అనుకూల మీడియానే పిలిపించుకుంటున్నారని చెబుతున్న ఇదే ఆంధ్రజ్యోతి.. అప్పుడెందుకు మాట్లాడలేదు. ఈ నీతులు అప్పుడేమయ్యాయి? మీ అనుకూల పార్టీ చేస్తే కరెక్టు.. మీరు వ్యతిరేకంగా భావించే పార్టీ చేస్తే తప్పా? ఇదే న్యాయం సామీ. గ్రో అప్