iDreamPost
android-app
ios-app

ఆంధ్రజ్యోతివి అబద్ధాలని చాటిచెప్పిన ఆదిత్యానాధ్ దాస్ వ్యవహారం

  • Published Sep 26, 2021 | 3:51 AM Updated Updated Mar 11, 2022 | 10:40 PM
ఆంధ్రజ్యోతివి అబద్ధాలని చాటిచెప్పిన ఆదిత్యానాధ్ దాస్ వ్యవహారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ నెలాఖరున ఆదిత్యానాధ్ దాస్ పదవీవిరమణ చేయబోతున్నారు. వాస్తవానికి ఆయన పదవీకాలం జూన్ తోనే ముగిసింది. కానీ జగన్ లేఖ రాసి, ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కోరడంతో మూడు నెలలు పొడిగింపు దక్కింది. ఫలితంగా సెప్టెంబర్ ఆఖరి వరకూ ఆయన సీఎస్ హోదాలో ఉన్నారు. ఇక ఈనెలాఖరున ఆయన పదవీ విరమణ తర్వాత కూడా ఏపీ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించబోతున్నారు. ఇరిగేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన సేవలను వినియోగించుకోవాలని జగన్ ఆశిస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు హోదా ఆయనకు కట్టబెట్టారు. క్యాబినెట్ హోదాతో ఆయనకు ఈ బాధ్యత అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

కొద్దిరోజుల క్రితం ఆదిత్యానాధ్ తర్వాత సమీర్ శర్మను సీఎస్ గా చేస్తూ వెలువడిన ఉత్తర్వులపై ఆంధ్రజ్యోతి ఓ అడ్డగోలు కథనం రాసేసింది. అలాంటి వాటికి ఆ పత్రిక పెట్టింది పేరు అన్నట్టుగా ఉందనడంలో సందేహం లేదు.అయితే ఏకంగా ఆదిత్యానాధ్ దాస్ తీరు మీద జగన్ అసంతృప్తిగా ఉన్నారని, జగన్ వ్యవహారశైలి ఆదిత్యానాధ్ దాస్ తో పాటుగా ఐఏఎస్ లలో అసహనానికి దారితీస్తుందని ఆ కథనంలో రాసేశారు. అందుకు ఉదాహరణగా 20రోజుల ముందుగానే సీఎస్ నియామక ఉత్తర్వులు ఇవ్వడం అంటూ ఓ నిరాధార అంశాన్ని అచ్చేశారు.

వాస్తవానికి జ్యోతి రాసిందంటే అందులో విశ్వసనీయత ఉండదనే అనుమానం పాఠకుల్లో అత్యధికులు భావిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఆదిత్యానాధ్ దాస్ వ్యవహారం మరో నిదర్శనంగా చెప్పవచ్చు. నిజంగా జగన్ మీద ఆయనలో అసహనం ఉంటే రిటైర్మెంట్ తర్వాత సొంత రాష్ట్రం ఒడిశా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అదీ కాకుండా హైదరాబాద్ కి షిఫ్ట్ అయినా అవుతారు. కానీ ఆయన మాత్రం ఏపీ ప్రభుత్వంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆయన తీరు జగన్ కి నచ్చకపోతే రిటైర్ కాగానే సాగనంపేవారు. కానీ దానికి విరుద్ధంగా ముఖ్య సలహాదారు హోదాని కట్టబెట్టారు.

నీలం సాహ్నికి కూడా తొలుత అదే హోదా దక్కిన సంగతి తెలిసిందే. అంటే జగన్ , ఆదిత్యానాధ్ దాస్ మధ్య వివాదం ఉందని చెబుతూ ఐఏఎస్ సహా ఇతర అధికార వర్గాల్లో అపోహలు రాజేయాలని ఆంధ్రజ్యోతి చూసినట్టుగా ఈ వ్యవహారం తేటతెల్లం చేస్తోంది.

ఇదొక్కటే కాకుండా ఆ పత్రిక రాతలు నిండా విషం పులుముకుని ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యం అన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. కానీ వారు ఎంత ప్రయాసపడుతున్నా ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో పదే పదే ఢీలా పడుతున్నారు. ఎంతగా అబద్ధాలు వల్లించినా వాటికి విరుగుడుగా జగన్ వ్యవహారశైలి ఉండడం జీర్ణం చేసుకోలేని స్థితికి బాబు బ్యాచ్ ని చేరుస్తోంది.