iDreamPost
android-app
ios-app

ABN Andhrajyothy – పాపం.. ఆంధ్రజ్యోతి అనుకోవాల్సిందే ఇక

  • Published Oct 19, 2021 | 4:05 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
ABN Andhrajyothy – పాపం.. ఆంధ్రజ్యోతి అనుకోవాల్సిందే ఇక

జగన్ అసమర్థుడు అని రాస్తారు..అంతలోనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కథనాలు ఇస్తారు. పాలన గాడి తప్పిందని వార్తలు ఇస్తారు.. మళ్లీ వారం తిరగకముందే ప్రభుత్వంపై జగన్ పూర్తిగా పట్టు బిగిస్తున్నారని అల్లేస్తుంటారు. ఇలా భిన్నమైన వాదనలను ఒకే పత్రికలో వెంటవెంటనే చేయడానికి సిద్ధపడడం చిన్న విషయం కాదు. అది కేవలం ఆంధ్రజ్యోతికే చెల్లింది. ఏ పూటకు ఆ మాట చెబుతూ కాలం గడపడం అసలు నైజం అని చాటుకుంటోంది. అందుకే “పాపం ఆంధ్రజ్యోతి “అనుకోవాల్సిందే తప్ప మరో అవకాశం లేదు.

ఏపీలో మతమార్పిడులు జరిగిపోతున్నాయని, మైనార్టీలకు మేలు చేయడం కోసం ఇతర మతాలను తక్కువ చూస్తున్నారంటూ కూడా కొన్ని అడ్డగోలు కథనాలు అచ్చేసిన చరిత్ర ఆంధ్రజ్యోతిది. జగన్ వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా ఆయన్ని నిలువరించాలనే లక్ష్యంతో విపక్ష టీడీపీ ఎత్తులకు ఈ పత్రిక తందాన అంటూ వార్తలు అల్లేసింది. హిందువులకు అన్యాయం చేస్తున్నారని అనేక విధాలుగా అర్థసత్యాలను ప్రచారంలో పెట్టింది. వాటిని ప్రజలు పట్టించుకోకపోయినా ఒకే అబద్ధాన్ని వందల సార్లు చెప్పడానికి సైతం వెనుకాడడం లేదు. బాబు హయంలో ఆలయాలకు అన్యాయం చేస్తే కిమ్మనకుండా కీర్తించిన రాధాకృష్ణ జగన్ పాలనలో జరిగిన కొన్ని ఘటనలను భూతద్దంలో చూపడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మైనార్టీలపై మమ కారం అంటూ కొత్త కథ రాసింది. ఇన్నాళ్లుగా మైనార్టీలకు చర్చిలు, మసీదులలో ఇమామ్ ల పేరుతో పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారని హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఆంధ్రజ్యోతిలోనే ఈ వార్త రావడం విస్మయం. బడ్జెట్ లో ప్రకటనలే తప్ప ఆచరణలో మాటల మాయగా మిగిలిందని ఆరోపించింది. ఇదే నిజం అనుకుంటే ఇన్నాళ్ళుగా మైనార్టీలకు జగన్ ఏదో ఒరగబెడుతున్నారంటూ జ్యోతి చిత్రాలన్నీ అబద్ధాలనేగా.. పోనీ ఇది అబద్ధం అనుకుంటే అవన్నీ నిజాలయిపోవుగా. ఇలాంటి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ తాము చేసిన వాదనను తామే తప్పని చెప్పుకోవడానికి సిద్ధపడుతూ ఆ పత్రిక తీరు విడ్డూరంగా ఉంటోంది. మైనార్టీలకు అంతా ఇచ్చేస్తున్నారని రాసిన పేపర్లోనే మైనార్టీలకు ఏమీ ఇవ్వడం లేదని రాయడం విచిత్రంగా ఉంటుంది. అయినా మాకేల సిగ్గు అన్నట్టుగా సాగిపోతున్నారు.

నిజానికి ఏపీలో మతాలు చూడం, కులాలు చూడం, పార్టీలు అసలే చూడం అని జగన్ అనేకమార్లు చెప్పారు. దానికి తగ్గట్టుగా అర్హులైన వారు ఒక్కరికి కూడా పథకాలు అందడం లేదనే వార్తలు లేవు. అర్హులకు దక్కకపోతే వెంటనే కేవలం వాలంటీర్ ద్వారా వారి వీధిలోనే సమస్య పరిష్కారమయిపోతోంది. అంతటి విస్తృత నెట్ వర్క్ పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఓవైపు ప్రజలకు అప్పులు తెచ్చి మరీ పథకాల పేరుతో పంపకాలు చేస్తున్నారని వక్రభాష్యాలు చెప్పే పత్రికల్లోనే మళ్లీ ఏమీ అందడం లేదని రాయడానికి ఎంత సిగ్గు విడిచి ఉండాలి. పైగా దమ్మున్న పత్రికాయే.. బహుశా అబద్ధాల్లో ఆరితేరిన దమ్మున్న మీడియా అనుకోవాలేమో. అయినా పంచేస్తున్నారని నిత్యం రాస్తూ అసలు పథకాలకు డబ్బులు లేవని రాయడం అడ్డగోలుతనానికి అల్టిమేట్ నిదర్శనం. ఏమయినా ఆంధ్రజ్యోతి బాధాకృష్ణ అన్నట్టుగా వారి అసహనం వర్ణనాతీతం అని అనేకమార్లు రుజువవుతోంది.

Also Read : ABN Fake Audio Peddareddy-ఏబీఎన్ ఆ స్థాయికి పడిపోయిందా, ఎందుకిలా దిగజారుతోంది