ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ సమీపంలో ఉన్న ఫూల్పూర్ ఐఎఫ్ఎఫ్‌సీఓ(ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్) ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ సంభవించడంతో ఇద్దరు మృతిచెందారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)లో మంగళవారం రాత్రి 11 గంటలకు PF-1 యూనిట్ లో అమోనియా గ్యాస్ లీక్ అయింది. దీంతో అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్న ఇద్దరు ఇఫ్కో అధికారులు వీపీ సింగ్, అభయ్ నందన్ లు మరణించగా మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయకచర్యలు చేపట్టి ప్రమాదం జరిగిన ప్లాంటును మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రయాగ్‌రాజ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ భాను చంద్ర గోస్వామి తెలిపారు.
ఈ సంఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు.