iDreamPost
iDreamPost
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ జనవరి 15 విడుదల ప్లాన్ చేసుకుని ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్మాతలు దీన్ని ఒకరోజు ప్రీ పోన్ చేసి 14నే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సీరియస్ గా చేస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇది ఎంత మేరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఏదైనా మార్పు ఉంటే ఈ రెండు మూడు రోజుల్లో తేల్చి చెప్పేయాలి. ఎందుకంటే ముందు చెప్పిన డేట్ కి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది. చేంజ్ చేస్తే ఆ రోజు చూడాలనుకున్న ప్రేక్షకులు మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని రీ బుక్ కు వెళ్లాల్సి ఉంటుంది.
ఇలా ఆలోచించడానికి కారణం లేకపోలేదు. నిన్న షోలు అంత ఆలస్యంగా పడినా క్రాక్ కు వచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో ఇంకో ఆరేడు రోజులు హౌస్ ఫుల్స్ ఖాయమనే నమ్మకంతో ఉంది. మరో వైపు అల్లుడు అదుర్స్ కంటే ముందు మాస్టర్, రెడ్ లు సందడి చేయబోతున్నాయి. వీటి కోసం స్క్రీన్లు చాలా బ్లాక్ అయ్యాయి. క్రాక్ కి అంత ఈజీగా కౌంట్ ని తగ్గించే ఛాన్స్ లేనట్టే. ముందస్తు ఒప్పందాలు జరిగి ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల తప్పదు కానీ అధిక శాతం మాత్రం క్రాక్ కి మాస్ ఆదరణ బాగుంటుందని కొనసాగించేందుకే ఇష్టపడతాయి.
సో ఆఖరున వచ్చే అల్లుడు అదుర్స్ కి ఎంత లేదన్నా కొన్ని ఇబ్బందులు తప్పవు. దాని బదులు ఒక రోజు ముందే వస్తే మెరుగైన వసూళ్లు రాబట్టుకోవచ్చనే కోణంలో విశ్లేషణ జరుగుతోంది. ట్రైలర్ సంగతి ఎలా ఉన్నా ఇలాంటి మసాలా ఎంటర్ టైనర్స్ కి మాస్ బాగానే వస్తారు. వీటికి మొదటి మూడు నాలుగు రోజులు చాలా కీలకం. సింహభాగం కలెక్షన్లను ఓపెనింగ్స్ తీసుకొస్తాయి. అందుకే అల్లుడు అదుర్స్ మార్పు గురించి డిస్కషన్ జరుగుతోంది. మరి రెడ్ కోసం 14న ఆల్రెడీ లాక్ అయిన అదనపు స్క్రీన్లను అల్లుడు అదుర్స్ పంచుకునే అవకాశం ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ వెలువడొచ్చు. చూద్దాం