iDreamPost
iDreamPost
ఎంత హంగామా చేసినా, కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసి తమ సినిమా హిట్ అని చెప్పుకున్నా ఫైనల్ గా అల్లుడు అదుర్స్ ఫ్లాప్ ముద్ర నుంచి తప్పించుకోలేకపోతోంది. ఎంటర్ టైన్మెంట్ అంటే నవ్వించడానికి ఏది బడితే అది చేయొచ్చని దర్శక రచయితలు వేసిన తప్పుడు అంచనా దానికి తగ్గ ఫలితాన్నే ఇస్తోంది. ఒకవేళ ఎలాంటి పండగ అడ్వాంటేజ్ లేకుండా ఇతర రోజుల్లో సోలోగా వచ్చి ఉంటే అల్లుడు అదుర్స్ ఏమయ్యేదో ఊహించడం కూడా కష్టమే. ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ టార్గెట్ సెట్ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకాస్త గట్టిగా ఇక్కడి కథల మీద ఫోకస్ చేస్తే బెటర్. ఇదే మూసలో ఉంటే మున్ముందు చాలా కష్టం.
ఇక లెక్కల విషయానికి వస్తే సుమారు తొమ్మిదిన్నర కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న అల్లుడు ఇప్పటిదాకా ఏడు కోట్ల మార్కు అందుకోవడానికే అష్టకష్టాలు పడుతున్నాడు. ఆల్రెడీ బొమ్మ వీకైపోయింది. సోమవారం నుంచి డ్రాప్ విపరీతంగా ఉంది. టాక్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మొదటి మూడు రోజులు సెలవులు కాబట్టి అంత మాత్రం మొత్తం వచ్చింది కానీ లేదంటే పరిస్థితి దారుణంగానే ఉండేది. సంక్రాంతికి నువ్వా నేనా అని పోటీ పడిన నాలుగు సినిమాల్లో అల్లుడు అదుర్స్ చివరి స్థానంలో నిలిచింది. యూనిట్ కూడా ఆ కారణంగానే హడావిడి చేయడం మానేసింది. ఇంటర్వ్యూలు కూడా ఆగిపోయాయి. ఇక లెక్కలు చూద్దాం.
ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :
ఏరియా | షేర్ |
నైజాం | 2.05cr |
సీడెడ్ | 1.32cr |
ఉత్తరాంధ్ర | 1.39cr |
గుంటూరు | 0.49cr |
క్రిష్ణ | 0.27cr |
ఈస్ట్ గోదావరి | 0.51cr |
వెస్ట్ గోదావరి | 0.46cr |
నెల్లూరు | 0.21cr |
ఆంధ్ర+తెలంగాణా | 6.70cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.13cr |
ఓవర్సీస్ | 0.05cr |
ప్రపంచవ్యాప్తంగా | 6.88cr |
ఎలా చూసుకున్నా అల్లుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా మూడు కోట్ల దాకా దూరంలో ఉన్నాడు. ఆల్రెడీ క్రాక్ దూసుకుపోతోంది. టాక్ తో సంబంధం లేకుండా రెడ్, మాస్టర్ కూడా బాగానే రాబట్టుకున్నాయి. ఎటొచ్చి అల్లుడుకే వచ్చింది అసలు చిక్కు. అందులోనూ ఎల్లుండి బంగారు బుల్లోడు విడుదల ఉంది కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే మాస్ ఆడియన్స్ దాని వైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆపై వారం మరో రెండు సినిమాలు క్యూ కట్టాయి. సో అల్లుడు అదుర్స్ కథ కంచికి చేరినట్టే. మరి మాది బెస్ట్ ఎంటర్ టైనర్ అని పదే పదే చెప్పుకున్న టీమ్ ఫైనల్ గా ఏమంటుందో చెప్పలేం కానీ కనీసం మనసులో అయినా ఏమనుకుంటుందో.