iDreamPost
android-app
ios-app

మరో పాన్ ఇండియా మూవీతో బన్నీ

  • Published Jul 01, 2021 | 1:30 PM Updated Updated Jul 01, 2021 | 1:30 PM
మరో పాన్ ఇండియా మూవీతో బన్నీ

ప్రస్తుతం పుష్ప రీ స్టార్ట్ చేయడం కోసం ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీని తర్వాత చేయబోయే సినిమాల గురించి ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య బన్నీ వాసు ఐకాన్ గురించి చెప్పాడు కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ నుంచి కానీ నిర్మాత దిల్ రాజు వైపు నుంచి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ రావడం లేదు. పుష్ప 2 కు ముందు వచ్చే గ్యాప్ లో ఏ ప్రాజెక్టు ఉంటుందనేది అర్థం కావడం లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం కోలీవుడ్ ప్రముఖ నిర్మాత థాను ప్రొడక్షన్ లో ఓ తమిళ దర్శకుడితో పాన్ ఇండియా మూవీ ఒకటి ప్లాన్ చేశారని చెన్నై మీడియా న్యూస్. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియలేదు.

ఆ మధ్య మురుగదాస్ తో బన్నీ చేస్తాడని టాక్ వచ్చింది కనక ఈ రెండు లింక్ చేసి చూస్తే స్పైడర్ తర్వాత దాస్ మూడోసారి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఐకాన్ ని ఇంకా వెనక్కు నెడతారేమో చూడాలి. పుష్పను ఈ వారమే కంటిన్యూ చేసేలా ఉన్నారు. వీలైనంత వేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నారు దర్శకుడు సుకుమార్. ముందు రెండు భాగాలు కంటిన్యూ గా షూట్ చేయాలనుకున్నప్పటికీ ఎందుకో మరి నిర్ణయం మార్చుకున్నారు. ఒకవేళ ఫలితం చూద్దామనుకున్నారో లేక బడ్జెట్ తదితర కారణాల వల్ల నిర్ణయం మార్చుకున్నారో తెలియదు కానీ పుష్ప హైప్ ఆల్రెడీ ఎక్కడికో వెళ్లిపోయింది.

అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ ఎలాంటి రిస్కులు చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికే కేరళలో మంచి మార్కెట్ వచ్చేసింది కాబట్టి హిందీ, తమిళంని ఒకేసారి టార్గెట్ చేసేలా పక్కా ప్లానింగ్ తో సాగుతున్నాడు. ముంబై పిఆర్ టీమ్ సహాయంతో పుష్పని ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేయబోతున్నారని న్యూస్ ఉంది. ఒక్క ప్రభాస్ కు మాత్రమే ఇప్పుడు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ రేస్ లో బన్నీతో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలు జాయిన్ అవుతున్నారు. బడ్జెట్ గురించి లెక్కలు వేసుకోకుండా అన్ని సినిమాలను పాన్ ఇండియా టార్గెట్ గానే చేసుకుంటున్నారు