iDreamPost
android-app
ios-app

Allu Arjun : భారీ మల్టీ స్టారర్ లో అల్లు అర్జున్

  • Published Feb 16, 2022 | 8:07 AM Updated Updated Feb 16, 2022 | 8:07 AM
Allu Arjun : భారీ మల్టీ స్టారర్ లో అల్లు అర్జున్

పుష్ప పార్ట్ 1 ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు మాములుగా లేదు. హడావిడి పడినా కూడా డిసెంబర్ లో రిలీజ్ చేయడం ఎంత గొప్ప నిర్ణయమో కళ్లారా చూశాం. ముంబై సిటీలో సాహో పేరు మీదున్న డబ్బింగ్ సినిమా కలెక్షన్ రికార్డుని పుష్ప అధిగమించడం చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక పాటలకు సంబందించి సోషల్ మీడియాలో వచ్చిన రీల్స్, వీడియోస్ తదితర హంగామా ఏకంగా సెలబ్రిటీలు క్రికెట్ స్టార్లను కూడా అందులో భాగం చేసింది. దీంతో బన్నీ కాస్తా ఇప్పుడు నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్న హీరో అయ్యాడు. దెబ్బకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు మెల్లగా తనతో భాగమయ్యేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు.

అందులో భాగంగా అక్షయ్ కుమార్ తో దర్శకుడు రోహిత్ శెట్టి ప్లాన్ చేసుకున్న ఓ భారీ మల్టీ స్టారర్ లో అల్లు అర్జున్ కు హీరో పాత్రను ఆఫర్ చేసినట్టు వినికిడి. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న ఈ ప్రాజెక్టులో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యం ఉండేలా కథ రాసుకున్నారట. కాంబినేషన్ ఫైనల్ అయ్యాక నిర్మాత ఎవరన్నది బయటికి వస్తుంది. దీనికి ఓకే చెబితే రెమ్యునరేషన్ కూడా ఊహించని విధంగా ఆఫర్ చేస్తారని టాక్. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమా లేదా అనేది తేలుతుంది. అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ ఇటీవలే టీవీలో టెలికాస్ట్ జరిగి అక్కడా సూపర్ రేటింగ్స్ తెచ్చుకున్నట్టు టీవీ వర్గాల మాట.

మొత్తానికి పాన్ ఇండియా రేంజ్ లో మన సౌత్ హీరోలు ఒక్కొక్కరు సెటిల్ కావడం సంతోషించాల్సిన విషయం. ముందు ప్రభాస్, తర్వాత యష్ ఇప్పుడు బన్నీ నెక్స్ట్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఆ పై పవన్ కళ్యాణ్ ఇలా అందరికీ అక్కడ బలమైన మార్కెట్ ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 90 దశకంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు ఎంత ప్రయత్నించినా ఎంత మంచి హిట్లు కొట్టినా మన జెండాను బలంగా పాతలేకపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఖాన్లే కుళ్ళుకునేలా మనవాళ్ళు సత్తా చాటుతున్న వైనం ఇతరులకు స్ఫూర్తినిస్తోంది. మరి అల్లు హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం

Also Read : Bheemla Nayak : ఇంత హఠాత్ నిర్ణయం ఎలా తీసుకున్నారు

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş