iDreamPost
android-app
ios-app

Allu Arjun : ఐకాన్ స్టార్ పాన్ ఇండియా ప్రమోషన్ ప్లాన్

  • Published Dec 01, 2021 | 6:19 AM Updated Updated Dec 01, 2021 | 6:19 AM
Allu Arjun : ఐకాన్ స్టార్ పాన్ ఇండియా ప్రమోషన్ ప్లాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప విడుదలకు అట్టే సమయం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు 16 రోజులు గడిచిపోతాయి. దర్శకుడు సుకుమార్ తో పాటు టీమ్ మొత్తం డే అండ్ నైట్ కష్టపడుతోంది. ప్రస్తుతం సమంతాతో స్పెషల్ సాంగ్ ని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీతో సహా పదుల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా నాన్ స్టాప్ గా దీన్ని తీయబోతున్నారు. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17 ఖచ్చితంగా పుష్ప వస్తుందా అంటే టీమ్ రాదని మాత్రం చెప్పడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెండింగ్ ఉంది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో త్వరలోనే నిర్వహించబోతున్నారు.

ఇదిలా ఉండగా పుష్పను పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేసేందుకు కావాల్సిన అన్ని అస్త్రాలను బన్నీ వాడబోతున్నాడని తెలిసింది. సల్మాన్ ఖాన్ హిందీలో నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 15 స్పెషల్ ఎపిసోడ్ లో అతిథిగా వెళ్లేందుకు ఒప్పుకున్నట్టు తాజా సమాచారం. ఇప్పటిదాకా ఆ షోలో ఏ సౌత్ ఇండియన్ స్టార్ గెస్ట్ గా వెళ్ళలేదు. ఇప్పుడు సల్మాన్ తో కనక బన్నీ జట్టు కడితే ఖచ్చితంగా అది పుష్ప మైలేజ్ కు పనికి వస్తుంది. ఇంకా అధికారిక ధ్రువీకరణ రాలేదు కానీ ప్రతిపాదన ఓకే అయ్యిందని అంటున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ లో నటిస్తున్న సల్మాన్ ఖాన్ కు బన్నీ రావడంలో అభ్యంతరం ఏముంటుంది.

ఇప్పటికే నాలుగు పాటలు విడుదలైన పుష్ప ఆల్బమ్ నుంచి అసలైన ఐటెం సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. ట్రైలర్ ని 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఒక రోజు ముందు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తో పాటు 24వ తేదీ శ్యామ్ సింగ రాయ్, 83 లాంటి భారీ సినిమాల పోటీ ఉండటంతో పుష్పకు బాక్సాఫీస్ వద్ద గట్టి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. హైప్ విషయంలో టెన్షన్ లేనప్పటికీ ఇప్పుడీ పార్ట్ 1 హిట్ అయితేనే సీక్వెల్ కి రూట్ క్లియర్ గా ఉంటుంది బాహుబలి లాగా. ఏ మాత్రం తేడా జరిగినా పార్ట్ 2 బిజినెస్ కి చిక్కులు తప్పవు. సుకుమార్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే పుష్ప మళ్ళీ రంగస్థలం ఫలితాన్ని రిపీట్ చేసేలాగే ఉంది

Also Read : Mehreen Pirzada : మొదటిసారి సీనియర్ హీరోకు జోడిగా

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş