iDreamPost
android-app
ios-app

షూటింగ్ లో ప్రమాదం – అక్కినేని అఖిల్ కి స్వల్ప గాయాలు

షూటింగ్ లో ప్రమాదం – అక్కినేని అఖిల్ కి స్వల్ప గాయాలు

అక్కినేని అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే చిత్రంలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరించే సమయంలో అఖిల్ కుడి మోచేతికి చిన్నపాటి గాయాలయ్యాయని తెలుస్తుంది.

దీంతో అఖిల్ కు కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చిత్ర షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ కి తీవ్ర గాయాలేమి కాలేదని ఈనెల 10 నుండి తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దాంతో షూటింగ్ వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అఖిల్ కి ప్రమాదమేమీ లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో అక్కినేని అఖిల్ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దాంతో అఖిల్ ఆశలన్నీ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పైనే ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ప్లాపుల్లో ఉన్నాడు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడం, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం అఖిల్ కూడా చిత్ర కథపై నమ్మకం ఉంచడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ ,సింగిల్స్ రిలీజ్ చేయడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే అధికారికంగా నిర్మాతలు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” హిట్ అవడం అఖిల్ కు దర్శకుడు భాస్కర్ కు ఇప్పుడు అత్యవసరం. ఒకవేళ పరాజయం పాలయితే వారి కెరీర్ ప్రమాదంలో పడినట్లే.