iDreamPost
android-app
ios-app

Akhanda : మాస్ సినిమా పవర్ ఏంటో చూపించింది

  • Published Dec 03, 2021 | 4:53 AM Updated Updated Dec 03, 2021 | 4:53 AM
Akhanda : మాస్ సినిమా పవర్ ఏంటో చూపించింది

అయిదు నెలలకు పైగా ఒక్కటంటే ఒక్కటి సరైన మాస్ సినిమా లేని ఆకలిని బాక్సాఫీస్ అఖండ రూపంలో పూర్తిగా తీర్చేసుకుంటోంది. కథా కథనాలు, బోయపాటి స్క్రీన్ ప్లే తదితరాలు పక్కనపెడితే బాలయ్య విశ్వరూపం బిసి సెంటర్స్ లో కనక వర్షం కురిపిస్తోంది. నగరాల్లోనూ బుకింగ్స్ ధీటుగా ఉన్నాయి. ఈలలు వేసే హీరోయిజం చూసి చాలా కాలమవ్వడంతో ఆడియన్స్ నిన్న అఖండకు భారీ కలెక్షన్లను కురిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద శాతం ఆక్యుపెన్సీ కారణంగా కలెక్షన్ల ప్రవాహానికి అడ్డు కట్ట లేకుండా పోయింది. గురువారం రిలీజ్ ని వాడుకుని ఏకంగా నాలుగు రోజుల పెద్ద వీకెండ్ అఖండకు చాలా పెద్ద ప్లస్ కానుంది.

ఇక ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు అఖండ మొదటి రోజు తెలుగు రాష్ట్రలో సుమారు 15 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించేసింది. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక ఇదే అతి పెద్ద షేర్. వర్కింగ్ డే రోజు కూడా ఈ స్థాయిలో ఫిగర్స్ నమోదు కావడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. అత్యధికంగా నైజామ్ లో 4 కోట్ల 38 లక్షలు వసూలు చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అదనపు షోలు టికెట్ రేట్ల పెంపు వెసులుబాటు ఉండటం తెలంగాణకు కలిసొచ్చింది. ఇవి లేకపోయినా కూడా సీడెడ్ లో 4 కోట్ల షేర్ ని దక్కించుకోవడం చూస్తే అక్కడ ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. ఇక ఏరియాల వారిగా ఇవి లెక్కలు

నైజామ్ – 4 కోట్ల 38 లక్షలు
సీడెడ్ – 4 కోట్ల 1 లక్ష
ఉత్తరాంధ్ర – 1 కోటి 36 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 4 లక్షలు
వెస్ట్ గోదావరి – 96 లక్షలు
గుంటూరు -1 కోటి 87 లక్షలు
కృష్ణా – 81 లక్షలు
నెల్లూరు – 93 లక్షలు

ఏపి/తెలంగాణ మొదటి రోజు షేర్ : 15 కోట్ల 36 లక్షలు

ఇది గ్రాస్ లెక్కలో చూసుకుంటే సుమారు 23 కోట్ల దాకా తేలుతుంది. ఓవర్సీస్ వివరాలు ఇంకా అందాల్సి ఉంది. 3 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు సమాచారం. ఇది బాలయ్య కెరీర్ లోనే రికార్డు బ్రేక్. గత రెండు వారాలుగా సినిమాలేవీ లేకపోవడంతో థియేటర్లన్నీ అఖండతో కళకళలడాయి. అత్యధిక సెంటర్లలో అన్ని షోలు బాలయ్యకే ఇచ్చేశారు. మల్టీ ప్లెక్సుల్లోనూ రద్దీ కనిపిస్తోంది. ఇక ఈ రోజు నుంచి కూడా ఇదే స్టాండ్ కంటిన్యూ చేస్తే టార్గెట్ పెట్టుకున్న 54 కోట్ల షేర్ ని చేరుకోవడం ఈజీనే. ఈ మూడు రోజుల వారాంతం చాలా కీలకం కానుంది. ఇవాళ రిలీజైన మరక్కార్ కు మలయాళంలోనే ప్లాప్ రిపోర్ట్స్ వచ్చాయి. సో అఖండ స్పీడుకి బ్రేకులు లేనట్టే

Also Read : Akhanda : ఖండ ఖండాలలో దుమ్మురేపుతున్న “అఖండ”

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş