అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయనపై ఉన్న కేసులు విత్ డ్రా చేసుకోలేదని అమిత్ షా స్పష్టం చేసారు. బీజేపీ అజిత్ పవార్ వెంట నడవదని, అజిత్ పవారే బీజేపీ వద్దకు అజిత్ పవార్ వస్తాడని వ్యాఖ్యానించాడు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కాగా 2013 లో మహారాష్ట్రలో జరిగిన ఇరిగేషన్ స్కాం లో అజిత్ పవార్ హస్తం ఉందని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కాగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో అజిత్ పవార్ మద్దతు తెలిపిన తర్వాత, ఇరిగేషన్ స్కాం లో అజిత్ పవార్ కి సంబంధం లేదని ఏసీబీ కోర్ట్ తీర్పునిస్తూ అజిత్ పవార్ పై ఉన్న 9 కేసులను కొట్టివేసింది.
కానీ మహారాష్ట్రలో జరిగిన అనూహ్య పరిణామాల వల్ల బీజేపీతో తెగతెంపులు చేసుకుంటూ అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. దీనితో మద్దతు లేక బలపరీక్ష జరగక ముందే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు తెలిపి తర్వాత ఉపసంహరించుకున్న అజిత్ పవార్ పై మోడీ – షా ద్వయం కోపంగా ఉన్నారని అందులో భాగంగానే అమిత్ షా అజిత్ పవార్ పై ఉన్న కేసులకు క్లీన్ చిట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.