iDreamPost
iDreamPost
లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోవడం రకరకాలుగా ప్రభావం చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల షెడ్యూల్స్ అన్నీ ఖంగాలీ అయిపోయాయి. దీని వల్ల విడుదల తేదీల విషయంలో అంతులేని అయోమయం నెలకొంటోంది. సంక్రాంతికి కేజిఎఫ్ 2, రంగ్ దే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రస్తుతానికి కన్నేయగా ఏమేం మార్పులు జరుగుతాయో ఇప్పుడే చెప్పలేం. అయితే మెజారిటీ నిర్మాతల కన్ను 2021 సమ్మర్ మీదే ఉంది. ఆర్ఆర్ఆర్, రాదే శ్యాం, ఆచార్యలు టార్గెట్ పెట్టుకోగా తాజాగా తలా అజిత్ కూడా రేస్ లోకి రాబోతున్నాడని చెన్నై టాక్. బోనీ కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న వలిమై(తెలుగు టైటిల్ డిసైడ్ కాలేదు) ఇప్పటిదాకా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా చాలా బాలన్స్ ఉంది.
కరోనా ముందు వరకు రామోజీ ఫిలిం సిటీలోనే కీలక ఎపిసోడ్లు షూట్ చేశారు. ఆరెక్స్ 100 ఫేం కార్తికేయ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న వలిమైలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రెగులర్ కాప్ ఫార్ములాలో కాకుండా దీన్ని విభిన్న రీతిలో తీస్తున్నారట. దీనికి విదేశాల్లో తీయాల్సిన పార్ట్ కూడా ఉంది. కాని కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే దాకా షూటింగ్ మొదలుపెట్టొద్దని అజిత్ ముందే స్ట్రిక్ట్ గా చెప్పేయడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజా సమాచారం మేరకు నవంబర్ నుంచి హైదరాబాద్ లోనే కొనసాగించబోతున్నారు.
ఫారిన్ లొకేషన్లో ప్లాన్ చేసినవి కూడా ఇక్కడే మేనేజ్ చేసేలా స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేస్తున్నారట. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న వలిమైలో కాలా ఫేమ్ హ్యుమా ఖురేషి ఒక కీలక పాత్ర చేస్తుండగా అసలు హీరొయిన్ ఎవరనే సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది. యువన్ శంకర్ రాజా ఇప్పటికే మ్యూజిక్ కంపోజింగ్ పూర్తి చేశారు. దీపావళికి అనుకున్న సినిమా కాస్తా ఏకంగా వేసవికి వెళ్ళిపోతోంది. చూస్తుంటే వచ్చే ఏడాది విపరీతమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అజిత్ కు ఇక్కడ భారీ మార్కెట్ లేదు కాని ఒకవేళ నిజంగా అలా డిసైడ్ అయితే పక్క రాష్ట్రాల్లో మాత్రం మన సినిమాలకు గండం తప్పదు. ఖాకీతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన వినోత్ దీన్ని అంతకు మించి అనే స్థాయిలో తీస్తున్నాడట. ఇతనికి అజిత్ తో ఇది రెండో చిత్రం. వకీల్ సాబ్ కు ముందే వచ్చిన పింక్ రీమేక్ నీర్కొండ పార్వైకు ఇతనే డైరెక్టర్