iDreamPost
iDreamPost
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ ను రేపు సాయంత్రం 5 గంటల లోపు శాసనసభలో బలం నిరూపించుకోమని ఈ ఉదయం సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేపు ఏమి జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.
అయితే ఊహించని విధంగా NCP తిరుగుబాటు నేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కొద్దిసేపటి కిందట ఉప ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనితో మహారాష్ట్ర రాజకీయాలు మళ్ళీ మొదటికొచ్చాయి.రేపటి బల పరీక్షలో గెలవటానికి బీజేపీ విపక్షాల ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని ప్రచారం జరుగుతుండగా అజిత్ పవార్ రాజీనామాతో బీజేపీ బల పరీక్షలో గెలిచే అవకాశాలు దాదాపు లేవు. అయితే వచ్చే 10-12 గంటలలో అమిత్ షా ఏదైనా వ్యూహం రచిస్తారా? శివసేన లేక NCP కి ముఖ్యమంత్రి పదవిని వారికి ఆఫర్ చేస్తారా?చూడాలి.
ఈ ఉదయం నుంచి శరద్ పవార్ కుటుంబం అజిత్ పవార్ ను వెనక్కి వచ్చేయమని విజ్ఞప్తి చేశారు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే అజిత్ పవార్ ను తిరిగి వచ్చేయమని రాజకీయాల కంటే కుటుంబం ముఖ్యమని ట్వీట్ చేశారు. మరో వైపు శరద్ పవార్ భార్య కూడా అజిత్ పవార్ తో చర్చలు జరిపినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక వైపు కుటుంబ ఒత్తిడి మరో వైపు తనతో ముగ్గురు,నలుగురు NCP ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ మంది లేకపోవటంతో అజిత్ పునరాలోచన చేసి ఉండవచ్చు.
మరో గంటలో అంటే 3:30 నిముషాలకి దేవేంద్ర ఫడణవీస్ మీడియా సమావేశం ఏర్పాటు చెశారు . ఈ సమావేశంలో ఫడణవీస్ కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.