iDreamPost
android-app
ios-app

జగన్ కు అగ్రిగోల్డ్ బాధితుల కృతఙ్ఞతలు

జగన్ కు అగ్రిగోల్డ్ బాధితుల కృతఙ్ఞతలు

పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 1150 కోట్ల కేటాయించడంపై  అగ్రి గోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు జరిగిన అన్యాయంపై చర్చించారు. ఈ క్రమంలో బాధితులు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని చూశారని.. తమని ఆదుకోవాలంటూ ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.  అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు చంద్రబాబు నిర్వాకం వల్లే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసారు.

తమ బాధలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాదయాత్రలో విన్నవించుకున్నామని, అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. మొదటి మంత్రి వర్గ సమావేశం లోనే రూ.1150 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, రాష్ట్ర అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ కో ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపలువురు అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.