iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్ విడుదల ఖరారు – అఫీషియల్

  • Published Nov 19, 2020 | 6:32 AM Updated Updated Nov 19, 2020 | 6:32 AM
ఆదిపురుష్ విడుదల ఖరారు – అఫీషియల్

ఈ రోజు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ఆదిపురుష్ సినిమా తాలూకు అప్డేట్ ఉంటుందని నిన్న ట్విట్టర్లో ప్రభాస్ ప్రకటించాక ఏదో స్వీట్ సర్ప్రైజ్ ఉంటుందని అందరూ ఆశించారు. హీరోయిన్ లేదా ముఖ్యమైన క్యారెక్టర్ కోసం ఎవరినైనా ప్రకటిస్తారేమో అనుకున్నారందరూ. అయితే ఆశ్చర్యకరంగా షాకిచ్చే రీతిలో ఏకంగా విడుదల తేదీనే అనౌన్స్ చేశారు. ఆదిపురుష్ ని 2022 సంవత్సరం ఆగస్ట్ 11 రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేశారు. అంటే అటుఇటుగా ఇంకో రెండు సంవత్సరాల టైం ఉందన్న మాట. సాహో కూడా 2018 ఆగస్ట్ లో రిలీజైన సంగతి అభిమానులకు గుర్తే.

నిజానికి రాధే శ్యాం తర్వాత ఏది ముందు ఏది తర్వాత అనే అయోమయం ఇప్పటిదాకా కొనసాగింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్టే. రాధే శ్యామ్ 2021కి వేసవి కంటే ముందే వచ్చే ఛాన్స్ లేదు. ఆలోగా షూట్ అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లు తదితర కార్యక్రమాలు ఉంటాయి. మరోవైపు ఆది పురుష్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎంతలేదన్నా దీనికి ఏడాది పైగా టైం అవసరం అవుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ ఏడాదికో సినిమా మాత్రమే వస్తుంది. రెండు వచ్చే ఛాన్స్ ఉందేమోనన్న అభిమానుల అంచనాలు ఈ విషయంలో తప్పినట్టే.

ఇక వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించే మూవీ 2023లోనే వస్తుంది. సుమారు 400 కోట్లకు పైగా బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్ కు మించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రూపొందుతున్న సినిమాకు కనీసం రెండేళ్లకు పైగా టైం మినిమం. అందుకే దాన్ని వెనక్కు జరిపినట్టు కనిపిస్తోంది. ఆది పురుష్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ప్రభాస్ రాముడిగా చేయబోతున్నాడు. సీత ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగలేదు. రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కానీ దర్శకుడు ఓం రౌత్ ఈ పాత్ర మీద చాలా హోమ్ వర్క్ చేస్తున్నారు. రాధే శ్యామ్ డేట్ ఖరారు కాకముందే ఆది పురుష్ విడుదల ఫిక్స్ కావడమే అసలు ట్విస్ట్