అదేమీ ఆఫ్రికా కాదు. మారుమూల దేశమూ కాదు.. కానీ దేశమంతా ఒక రాజ్యాంగం అమలవుతుంటే ఆప్రాంతంలో మాత్రం ఆయన చెప్పిందే వేదం ఆయన మాటే రాజ్యాంగం..చట్టాలు గిట్టాలు నై జాన్తా..అన్న చెప్పిందే వేదం.వారికి అడ్డొచ్చినా.. వారి దారికి అడ్డంగా నిలబడినా ఊరవతల పాతేస్తారు… దశాబ్దాల సాగుతున్న ఆటవిక న్యాయానికి అంతు లేనట్లుగా ఉంది.
టెక్కలి ప్రాంతాన్ని దాదాపుగా సామంత రాజ్యంగా చేసుకుని కొన్నేళ్లుగా పాలన సాగిస్తున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి దాష్టీకాలకు అంతూ పంతూ లేదు. ఆయన మాటకు ఎదురెల్తే కరుసై పోవడం ఖాయం.ఆ ప్రాంతంలో ఎక్కడ ఎవరు ఏపదవికి పోటీ చేయాలన్నా అచ్చెన్నఅనుమతి ఉండాలి.
ఏ ఊళ్ళో ఏ కుటుంబం ఎవరికి ఓటేసేదీ అచ్చెన్నకు చెప్పాలి. ఆయనకు నచ్చాలి.. లేదంటే జరిగే రిణామాలు మామూలుగా ఉండవు. మొన్నటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన పాపానికి తమ కుటుంబాని కి చెందిన కింజరాపు అప్పన్నకే ఆటవిక రాజ్యం రుచి చూపించారు. తమ కుటుంబానికి చెందిన తమ అన్నదమ్ముల వంశానికి చెందిన, తమ ఇంటిపేరున్న కింజరాపు అప్పన్న మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో టబొమ్మాళి మండలం నిమ్మాడలో పోటీ చేశారు. అయితే ఈ పోటీలో అప్పన్న ఓడిపోగా అచ్చెన్న సతీమణి గెలుపొందారు.
అయినా సరే అచ్చెన్న అహం చల్లార.లేదు
” ఓస్.. ఏటీ వీడి గీర.మామీదే బరిలో దిగుతాడా? ఈడ్ని ఇలాగే ఒగ్గిస్తే రేపు ఇంకొకడు… ఎల్లుండి ఇంకొకడు మా పెద్దరికాన్ని ప్రశ్నిస్తే ఎలా? మేం మామూలు మనుషులం అయిపోతామేమో అన్న భయం పుట్టుకొచ్చిన అచ్చెన్నతనలోని పెత్తందారీ బుర్రను బయటకు తీశారు..
అప్పన్నతో మాట్లాడితే… అవుట్….
తమపెద్దరికానికి అడ్డురావడం, తనను ఎదిరించి ఎన్నికల్లో దిగడంతో అచ్చెన్నలోని అహం బయటికొచ్చింది. గ్రామంలో కులం కట్టుబాట్ల పేరిట కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇదిగో అందరికి చెబుతున్నా.అప్పన్నను ఊల్లోంచి వెలేస్తున్నాం.. ఆయన ఇంటి మంచి చెడ్డలకు ఎవరు వెళ్లినా వారికీ ఇదే గతి పడుతుంది.
ఆయనతో మాట్లాడినా ఇదే ఫలితం.. వారి పొలానికి కూలీలు వెళ్లకూడదు. ఆయన ఊళ్ళో తలవంచుకుని ఉండడం వరకే తప్ప ఆయనకు హక్కులేవీ ఉండవు. అంటూ ఫత్వా చేశారు. వారి కుటుంబం గత చరిత్ర ఎరిగినవారెవరూ ఆంక్షలను ధిక్కరించేందుకు ముందుకురారు. కోరి దయ్యంతో తగాదా పెట్టుకునే ధైర్యం ఎందుకు చేస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఉన్న హక్కు మాకు ఉండదా? పోటీ చేయడం నేరమా అని అప్పన్న కుటుంబం ఆక్రోశిస్తోంది.
తమ పొలం పనులకు కూలీలు రాకూడదు. గ్రామంలోని ఇతర కులవృత్తులవారైన రజకులు, నాయీబ్రాహ్మణులు పై తం వారికి సహకరించకూడదని అచ్చెన్న హుకుం జారీ చేయడం, అది మరుక్షణమే అమల్లోకి రావడంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. అచ్చెన్న కుటుంబానికి ఉన్న గత చరిత్ర తలచుకుని తమను క్షణం ఏం చేస్తారోనని కుటుంబం నిద్రలేని రాత్రులు గడుపుతోంది.