iDreamPost
android-app
ios-app

‘తూర్పు’ లో ఘోర రోడ్డు ప్రమాదం – 8 మంది మృతి

‘తూర్పు’ లో ఘోర రోడ్డు ప్రమాదం – 8 మంది మృతి

తూర్పుగోదావరి జిల్లా లోని మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు టెంపో వాహనం లోయలో పడిపోయిన దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. భద్రాచలం నుంచి అన్నవరం బయలుదేరిన టెంపో(ఏపీ 16 టీడీ 6849) మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో వాలీ-సుగ్రీవుల కొండ వద్ద ప్రమాదానికి గురైంది. ఘాట్‌ రోడ్డులో సుమారు 20 అడుగుల పైనుంచి లోయలోకి పడిపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్నవారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అధి​కారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.