iDreamPost
iDreamPost
దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపై చర్చలను, భావప్రకటనాస్వేచ్చను అడ్డుకోవడానికి కొన్ని సార్లు కోర్టు దిక్కారణ అనే విచక్షణాధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్ అన్నారు. కోర్టులకు భావప్రకటనాస్వేచ్చను అడ్డుకునేలా ఉన్న ఇలాంటి అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరం అని, ఇప్పటికే అనేక దేశాల్లో కోర్టు దిక్కరణను నేరంగా పరిగణించడాన్ని రద్దు చేశారని, భారత్ లాంటి కొన్ని దేశాల్లోనే అదింకా నేరంగా పరిగణిచబడుతుందని, విదేశీ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా నిర్వహించిన ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ది ఇండియన్ జ్యుడిషియరీ’ అనే వెబ్‌నార్‌లో భూషణ్ అభిప్రాయపడ్డారు.
సీజేఐ బాబ్డేతో పాటు మరో నలుగురు సీజేఐలపై ఇటీవల ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద ట్వీట్లు చేసిన నేపధ్యంలో ఆయన ట్వీట్లను కోర్టు ధిక్కారం వ్యాఖ్యలుగా భావించి జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం రూపాయి జరిమానా కట్టాలని , ఒక వేళ చెల్లించని పక్షంలో మూడు నెలల జైలుశిక్షతో పాటు ప్రాక్టీస్‌పై మూడేళ్ల నిషేధం విధిస్తాం అని తీర్పుని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ చేసిన ఈ వాఖ్యలు మళ్ళీ చర్చనీయంశంగా మారాయి.