బాలకృష్ణ అరవయ్యో పడిలో పడుతున్న సందర్భంగా ఆంధ్రజ్యోతి చేసిన ఇంటర్వ్యూలో విలేఖరి నరసింహారావు అడిగిన కొన్ని ప్రశ్నలు చూస్తే ఆంధ్రజ్యోతి మరో కొత్త ప్రచారానికి పునాదులు వేస్తుందా?అన్న అనుమానం కలుగుతుంది.
మీ నాన్న గారికి కేసీఆర్ గారు అభిమాని , అలాగే జగన్ మీకు ఫాన్ అంట కదా ?ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీ అభిమానులు అంట కదా? అని ఒకటికి రెండుసార్లు అడగటం చూస్తే వారు అభిమానులా కాదా అని తెలుసుకోవాలన్న ఆసక్తి కన్నా జగన్ బాలకృష్ణ అభిమానే అని చెప్పించాలన్న ఆత్రం కనిపిస్తుంది.
బాలకృష్ణ సూటిగా సమాధానం చెప్పకుండ నవ్వి ఊరుకొన్నా రిపీటెడ్ గా జగన్ మీ అభిమానిగా యాడ్స్ కూడా ఇచ్చేవారట మిమ్మల్ని ఎప్పుడైనా కలిశారా , అభినందించడం , జన్మదిన శుభాకాంక్షలు తెలపడం లాంటివి చేశారా అంటూ ఓ ఫేక్ పేపర్ కటింగ్ ఆధారంగా తిప్పితిప్పి అడగడంలోని ఆంతర్యం ఏమిటీ . నిజానికి ఆ ఫేక్ పేపర్ కటింగ్ లో సమరసింహారెడ్డి సినిమా విజయాన్ని పురస్కరించుకొని 2000 సంవత్సరంలో ఇచ్చిన యాడ్ గా క్రియేట్ చేసింది .
1978 నుంచే వైఎస్ కి , బాబుకి ఉన్న పరిచయం రీత్యా బాలక్రిష్ణని కలవడం , లేదా ఫోన్ చేయడం జగన్ కు చాలా సులభమైన పని . నిజంగా జగన్ బాలక్రిష్ణకి అభిమాని అయితే జగన్ స్కూల్ రోజుల్లోనే కాలేజి రోజుల్లోనే లేక ఆత్త్రువాత్నో ఒక్కసారన్నా బాలకృష్ణకు ఎందుకు ఫోన్ చేయలేదు?ఎందుకు కలవలేదు?ఈ చిన్న ఆలోచన సదరు జర్నలిస్ట్ కి ఎందుకు కలగలేదో ! .
నిజానికి 1999 నాటికి పూర్తిగా ప్లాప్స్ లో ఉండి కెరీర్ ముగిసినట్టే అని ఇండస్ట్రీలో టాక్ ఉన్న టైంలో రాయలసీమ పేరు వాడుకొంటూ , ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసి మంచి విజయం సాధించిన సమరసింహా రెడ్డి సినిమా పై సీమ మేధావులు అప్పట్లోనే నిరసనలు వ్యక్తం చేశారు . ఫ్యాక్షనే సీమ సంస్కృతి అన్నట్టు తీసిన ఈ సినిమా తర్వాతి కాలంలో అదే మూసలో సీమ సంస్కృతి పై విషం చిమ్ముతూ పలు సినిమాలు రావటానికి కారణమయ్యింది అని చెప్పొచ్చు . 1996 నుండే రాజకీయాలతో సంభందం ఉన్న జగన్ సీమ సంస్కృతి పై వ్యతిరేక ముద్ర వేసిన సినిమాకి ఎలా యాడ్ లు ఇచ్చాడో ABN వారే చెప్పాలి .
అలాగే ఈ రోజు ABN న్యూస్ లో “మన బాలయ్య పుట్టిన రోజు ఇలా చేద్దాం ….జగన్ పిలుపు” అనే హెడ్డింగ్ తో ఒక ఆర్టికల్ రాసింది . హెడ్డింగ్ చూసి నివ్వెరపోయిన జనం సదరు వార్తలోకి వెళ్లి చూడగా యెన్ బి కే హెల్పింగ్ హాండ్స్ సంస్థ నుండి జగన్ అనే వ్యక్తి బాలయ్య పుట్టిన రోజు వేడుక ఇలా జరుపుకొందాం అని పిలుపిచ్చాడు అంటూ ముక్తాయించింది . సదరు వార్త చూసిన వైసీపీ అభిమానులు భగ్గుమన్నారు .
గత పదేళ్లుగా ఇలాంటి విద్వేషాలు రేకెత్తించే కథనాలతో , అసత్య ప్రచారాలతో టీడీపీ వైరి పక్షాల పై వార్తలు వండి వార్చిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా నందమూరి కుటుంబ హీరోల అభిమానులు అంటూ భవిష్యత్ కాలంలో టీడీపీ ఎమ్మెల్యే , చంద్రబాబు బామ్మర్ది అయిన బాలకృష్ణకి అనుకూలంగా వార్తలు వండి వారుస్తూ తద్వారా టీడీపీకి , బాబుకి సానుకూల వాతావరణం క్రియేట్ చేద్దామనే ఆలోచన అని చెప్పొచ్చు .
అయితే ప్రజలు గతంలోలా ఏమి రాసినా నమ్మే పరిస్థితి లేదని క్షణాల్లో నిజాలు అందించే పలు ఆన్లైన్ పత్రికలు , సోషల్ మీడియా ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకొంటున్నారని కొందరు పత్రికాధిపతులకు ఇంకా అర్ధం అయ్యినట్టు లేదు .