iDreamPost
iDreamPost
ఆంధ్రజ్యోతి రాతలు బాగా ఫాలో అయ్యే వారికి రెండేళ్ల కిందటి వార్త ఒకటి బాగా గుర్తుండాలి. అప్పట్లో ఎన్నికలకు ముందు వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అంటూ ఓ కథ వండి వార్చారు. అప్పట్లో ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగారని ఓ కథనం ప్రచురించారు. కానీ ఏమయ్యింది..వైవీ సుబ్బారెడ్డి పార్టీలో తన బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చారు. ముఖ్యంగా కీలకమైన గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ గా పార్టీని విజయపథంలో నడిపించడానికి తన శక్తులన్నీ వినియోగించారు. ఆయన అనుభవం అక్కరకు రావడంతో జగన్ హవా తోడయ్యి గోదావరి జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది.
ఇప్పుడు మళ్లీ టీటీడీ చైర్మన్ గిరీ విషయంలో మరోసారి జ్యోతి చిత్రాలు చూపిస్తోంది ఈసారి జగన్ మీద తీవ్ర అసంతృప్తితో సుబ్బారెడ్డి విదేశీయానం వెళ్లిపోయారని ఇన్ సైడ్ స్టోరీ అంటూ ఓ అవుట్ డేటెడ్ కథ అల్లేసింది. ఓవైపు టీటీడీ చైర్మన్ గిరీతో పాటుగా బోర్డు సభ్యత్వం కోసం పెద్ద పోటీ ఉందని చెబుతారు. అంతేగాకుండా కేంద్రమంత్రుల నుంచి సైతం ఒత్తిళ్లున్నాయని కూడా రాస్తారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్ పదవికి సుబ్బారెడ్డి ససేమీరా అంటున్నట్టు చెప్పుకొస్తారు. అంటే రెండు రకలా వాదనలు అదే పత్రిక చేయడం విశేషం.
Also Read:బద్వేల్ బరిలో నిలిచేందుకు ఆపార్టీ భయపడుతోందా?
నిజానికి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా కొనసాగించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానిని అధికారికంగా ప్రకటించడానికి అనుగుణంగా పాలకమండలి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. అది కొలిక్కి వస్తే సుబ్బారెడ్డిని చైర్మన్ హోదాలో మరోసారి నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. కానీ దానిని రాధాకృష్ణ పత్రికలో వక్రీకరించి రాయడం, మళ్లీ నిజంగా చైర్మన్ ప్రకటన రాగానే మళ్లీ తాము ముందే చెప్పామని రాసుకోవడం వాళ్లకే చెల్లినట్టుంది. ఇలాంటి ప్రయత్నాలు ఆ పత్రికకు అలవాటుగా మారినప్పటికీ ప్రజల్లో మాత్రం ఆపహాస్యం పాలవుతున్నామనే విషయాన్ని గుర్తించలేకపోవడం వల్లనే అంధజ్యోతి అనే ముద్ర బలపడుతోంది.