iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకా ఎందుకు రద్దు చేయలేదని కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నుకున్న ప్రజలపై, ప్రశ్నించని మేధావులపై ఈ వారం
కొత్తపలుకులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లేని ఆర్థిక విధ్వంసం ఏపీలో నెలకొందని అయినా ఎవరూ పట్టించుకోవడం లేదేమిటని ఆయన ఆవేదన. తనకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడాన్ని తట్టుకోలేక పోతున్న రాధాకృష్ణ తాను ఎన్ని కొత్తపలుకులు రాసినా సమాజంలో ఎవరూ స్పందించడం లేదనే ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రజల పక్షం వహించవలసిన జర్నలిజాన్ని వారిని నిందించడానికి ఉపయోగించారు.
శాసనసభ్యులపైన అధికారులపైన నిందలు..
రాష్ట్రంలో మెడకాయపై తలకాయ ఉన్న అధికారులు లేనందు వల్ల, శాసనసభ్యుల వల్ల బిల్లులను సరిగా రూపొందించుకోలేని పరిస్థితి ఉందని రాశారు. అందుకే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవలసి వచ్చిందని సూత్రీకరించారు. ఆ బిల్లుల ఉపసంహరణకు కారణాలను ప్రభుత్వం స్పష్టంగా వివరించినా సరే తనదైన శైలిలో రాధాకృష్ణ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేళ్ల సమయమే ఉందని, కొత్త బిల్లు ఎప్పుడు తెస్తారు? రాజధాని ఎప్పుడు నిర్మిస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయి ఏడున్నర ఏళ్లు అయినా ఇంకా రాజధాని నిర్మించుకోలేక పోయామని వాపోయారు. అయితే ఆ ఏడున్నర ఏళ్లలో అయిదేళ్లు తన బాస్ చంద్రబాబునాయుడు పరిపాలన వెలగబెట్టిన సంగతి రాధాకృష్ణ మరచిపోయారా? పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను విడిచిపెట్టి, రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్దుకుని అమరావతి వచ్చేసిన విషయం గుర్తు లేదా?
తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన చంద్రబాబు వైఖరి వల్లనే రాజధాని అంశం ఇంత సంక్లిష్టంగా మారిందన్న సంగతి రాధాకృష్ణకు తెలియదా? దమ్మున్న మీడియాకు బాస్ ను అని చెప్పుకొనే వేమూరి వారు రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలను ఏనాడైనా ప్రశ్నించారా? ఆ తప్పులను సరిచేసి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు వెళుతుంటే కడుపుమంట ఎందుకు?
Also Read : RK కొత్త పలుకు – తెలంగాణ ప్రజల గొప్పతనం అర్ధం చేసుకుంటే ఏపీ ప్రజలకు మంచిరోజులొస్తాయంట..!
రాజకీయ నాయకుడిలా విమర్శలు..
రాయలసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పెళ్లిళ్లు, పేరంటాలకు, విందు భోజనాలకు వెళుతున్నారని విమర్శించి ఒక రాజకీయ నాయకుడిలా వ్యాఖ్యలు చేశారు. పరిపాలనకు సంబంధించి ఒక్కో ముఖ్యమంత్రికి ఒక్కో శైలి ఉంటుంది. అందరూ చంద్రబాబునాయుడులా పరిపాలించాలని లేదు. బాధితులకు సాయం అందించడం ముఖ్యం కాని సీఎం ఆ ప్రాంతాలను సందర్శించడం కాదు. పలానా ప్రాంతంలో బాధితులకు సాయం అందలేదు, ఈ ప్రభుత్వం పనీతీరు బాగా లేదు అని విమర్శిస్తే అర్థవంతంగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లలేదని అదేపనిగా నిందలు వేయడం ఏమిటి? పైగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడకు వెళ్లి తిష్ట వేస్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగదా? 1996 తుపాను సమయంలో రాజమండ్రిలో,
, 2014 హుద్ హుద్ తుపాను వేళ విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు మకాం చేయడం వల్ల అధికారులపై ఒత్తిడి పెంచడం తప్ప సాధించింది ఏమిటి? బహుశా వీటిని దృష్టిలో పెట్టుకునే సీఎం జగన్మోహనరెడ్డిని వరద ప్రాంతాల్లో పర్యటించవద్దని అధికారులు సూచించి ఉంటారు. వారి సూచనల మేరకే తాను ఆ సమయంలో పర్యటించలేదని సీఎం చెప్పడమే కాక తప్పక బాధితులను కలుస్తానని స్పష్టం చేశారు. అయినా రాధాకృష్ణ వరదల వేళ తన బురద జల్లుడు ఆపలేదు.
సినిమా టికెట్ల ధరల నియంత్రణపైనా ఆగ్రహం..
రాష్ట్రంలో సిమెంటు, ఇనుము, ఇసుక ధరలు పెరిగిపోయాయని వాటిని అదుపు చేయకుండా సినిమా టికెట్ల ధరలను అదుపు చేయడం ఏమిటని ఆవేదన చెందారు. అంటే రాధాకృష్ణ దృష్టిలో ఇది కూడా తప్పే. రాష్ట్రంలో అన్నింటి ధరలు అదుపు చేశాకే సినిమా టికెట్ల ధరలు తగ్గించాలన్న మాట!
Also Read : ABN RK Kotha Paluku, Chandrababu Crying – చంద్రబాబు కన్నీళ్లకు రాధాకృష్ణ భాష్యం