ఎల్లో మీడియా అంటే వెంటనే గుర్తొచ్చే మొదటి పేరు ఈనాడు అయితే తర్వాతి పేరు ఆంధ్రజ్యోతి.అంతలా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి ఒక వెన్నుముకగా పనిచేస్తూ వచ్చింది. అయితే అలాంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు లోకేష్ లెక్కలోనే లేడని తీసి పారేయడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వయసు మీద పడటంతో ఆయన వారసుడిగా లోకేష్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో భాగంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత లోకేష్‌ను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి తద్వారా మంత్రిని చేశారు. అధికారుల పనితీరుతో మంచి ఫలితాలు రాబట్టి అవి లోకేష్ ఖాతాలో వేయించే ప్రయత్నాలు దండిగానే జరిగాయి. అయితే 2019 ఎన్నికల కోసం ఫ్రంట్ ఫేస్ చంద్రబాబుది ఉన్నా నారా లోకేష్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసి టిక్కెట్ల కేటాయింపు మొదలు, ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం ఇలా అన్ని విషయాల్లో వేలు పెట్టి జగన్ దెబ్బకు నాలుక కరుచుకున్నారు.
ఇక ఈ క్రమంలో 2024 ఎన్నికలలో ఎలా అయినా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు పని చేస్తున్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే తాజాగా ఆంధ్రజ్యోతి వేదికగా వెలువడిన ఒక కథనం ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులకే మింగుడు పడడం లేదు. ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహం అని చెబుతూ ఆంధ్రజ్యోతి రాసిన వార్త తెలుగుదేశానికి నష్టం చేసేదేనని భావిస్తున్నారు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 2019 ఎన్నికలలో జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీం కులాల కుంపట్లు రగిల్చి తద్వారా లబ్దిపొంది జగన్‌ను అధికారంలో కూర్చోబెట్టిందని, ఇప్పుడు ఈ విషయం తెలుగుదేశం పార్టీకి అర్థంకావడంతో వాళ్ళు దానికి సంబంధించిన ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని కథనంలో పేర్కొన్నారు.అందుకే ఈసారి వైసీపీ తరఫున పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం మౌత్ పబ్లిసిటీతో ప్రజల మనసు మార్చే యోచనలో ఉందని చెప్పుకొచ్చారు.
Also Read : Raghunandan Rao Warn YCP – ఇది బాబు రకం బెదిరింపా రఘునందన్ రావు..?
అదేమిటంటే సాధారణంగా రచ్చబండ లాంటి ప్రాంతాలలో ప్రశాంత్ కిషోర్ టీం తరఫున శిక్షణ పొందిన ఒక వ్యక్తిముందు జగన్ పరిపాలన బాగోలేదు అంటూ మాట కలిపి,చంద్రబాబు ఉంటే బాగుండేది కానీ ఈసారి చంద్రబాబును గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆయన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాడు అనే సంకేతాలు పంపుతారు అనేది ఆ కథనం సారాంశం. అంటే చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందినా సరే ముఖ్యమంత్రి పీఠం ఎక్కేది మాత్రం నారా లోకేష్, అలాంటప్పుడు లోకేష్‌తో పోలిస్తే జగన్ బెటర్ కదా అనే వ్యూహాత్మక ఆలోచనా ధోరణిని సామాన్యుల మనసుల్లో చొప్పించడానికి ఈ ప్లాన్ సిద్ధం చేశారని కథనం సారాంశం. ఇక్కడ ఏదో విశ్లేషణ చేయడానికి ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది కానీ అంతిమంగా లోకేష్ ఏమాత్రం పనికిరాడు అనే విషయాన్ని ఆంధ్రజ్యోతి స్వయంగా ఒప్పుకున్నట్లు అయింది. అంతే కాక ప్రశాంత్ కిషోర్ తన వ్యూహకర్త అని 2019 ఎన్నికల ముందు జగన్ ప్రకటించారు. 2024 ఎన్నికలకు కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తారని ఇటీవల వెల్లడించారు.
ఇందులో దాపరికాలు ఏమి లేవు కానీ వాళ్ళు ఇంకా పని కూడా మొదలుపెట్టక ముందే ప్రశాంత్ కిషోర్ టీం ఇలా చేస్తోంది, అలా చేస్తోంది అంటూ కథనాలు పుట్టిస్తున్నారో, కథలు రాస్తున్నారో తెలియదు కానీ కొత్త కొత్త చర్చలకు మాత్రం తావిస్తున్నారు.ఇది మాత్రమే కాదు ఆంధ్రజ్యోతి గత కొద్ది రోజులుగా కొన్ని కథనాల విషయంలో తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తోంది అని తెలుగుదేశం పార్టీ అభిమానులు భావిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో బాలకృష్ణతో మంచు విష్ణు భేటీ విషయంలో కూడా బాలకృష్ణ ఏదో తప్పుచేశాడు అన్నట్టు కథనం రాసిందని అప్పట్లో బాధ వెళ్లగక్కారు. ఇప్పుడు కూడా ఒక నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి చూస్తున్న లోకేష్‌ని తక్కువ చేసినట్టు కథనం ఉందని బాధ పడుతున్నారు.
Also Read : AP Cabinet Decisions – సామాజిక సంక్షేమం వైపు అడుగులు.. ఏపీ కేబినెట్ కీలక తీర్మానాలు