iDreamPost
iDreamPost
జయంతి, వర్థంతులకు తేడా తెలియకుండా కామెంట్ చేయడంపై ఏపీలో నారా లోకేష్‌కు మాత్రమే పేటెంట్ ఉందనుకునే వారు ఇప్పటి వరకు. కానీ ఆయన బృందంలోని అందరిదీ అదే దారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్టీ అధికార పత్రికగా మారిపోయిన ఆంధ్రజ్యోతి ఇప్పుడీ పొరపాటు చేయడం సదరు సంఘీయుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది.
ఈనెల 17వ తేదీన విశ్వకర్మ జయంతి. ఆ సందర్భంగా అందరూ విశ్వకర్మసేవలను గుర్తు చేసుకోవడంతో, సంబంధిత విశ్వబ్రాహ్మణులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే నారా వారి ఛానల్ అయిన ఏబీఎన్‌లో జయంతికి బదులు వర్ధంతిగాను, విశ్వబ్రాహ్మణులకు బదులు నాయీ బ్రాహ్మణులుగానూ పేర్కొంటూ వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపినట్లుగా స్క్రోలింగ్ ప్రసారమైందని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మహబ్రహ్మాచారి ఆందోళనకు చేపట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనమని, వారి మనోభవాలను దెబ్బతీయడమేని ఆరోపిస్తూ గుంటూరు కొత్తపేటలో హోర్డింగ్ పైకెక్కి నిరసన తెలియజేసారు. సమయానికి పోలీసులు కలుగజేసుకుని ఆయనకు నచ్చజెప్పి, అక్కడ్నుంచి క్రిందకు దింపారు.
నిజానికి ప్రసార సంబంధమైన లోపంగానే దీనిని పరిగణించి, తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. తిరిగి సవరణ స్క్రోలింగ్‌ను ప్రసారం చేయొచ్చు. తద్వారా జరిగిన పొరపాటును కొంతైనా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అటువంటి ప్రయత్నాలేమీ అటు తెలుగుదేశం పార్టీగానీ, ఇటు ఏబీఎన్‌గానీ చేసిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో విశ్రబ్రాహ్మణుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఇటువంటి పొరపాట్లను సరిద్దుకునే అవకాశం ఎవ్వరికైనా ఇవ్వాల్సిందే. ఇందుకు అందరూ అంగీకరిస్తారు.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబునాయు, వారి పేరు మీద ఏబీఎన్ ఛానల్ ఈ పొరపాటు చేసిందికానీ, అదే ఏ వైఎస్ జగన్ పేరుమీదనో, ఆయనకు సంబంధించిన పేపర్, ఛానల్‌లో ఇటువంటి పొరపాటు జరిగి ఉంటే ఏ స్థాయిలో రచ్చచేసేవారో కదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినప్పటికీ వాటిలోకి లాగి మరీ నానా రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో వారీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో కూడా వాస్తవం ఉందనిపించకమానదు.