iDreamPost
android-app
ios-app

అగ్గి రాజేసేందుకు ఆర్కే ఆపసోపాలు

  • Published Oct 03, 2021 | 7:48 AM Updated Updated Oct 03, 2021 | 7:48 AM
అగ్గి రాజేసేందుకు ఆర్కే ఆపసోపాలు

ఆవు వ్యాసం ఒక్కటే రాయడం వచ్చిన విద్యార్థిని ఏ అంశంపై వ్యాసం రాయమన్నా తిప్పితిప్పి ఆవు గురించే రాసినట్టు ఉంటోంది ఆంధ్రజ్యోతిలోని కొత్తపలుకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్న ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏ అంశంపై కొత్తపలుకు రాస్తున్నా అంతిమంగా జగన్ నే టార్గెట్ చేస్తుంటారు. ఈ వారం కూడా ఆయన కలం అలాగే కులుకులు ఒలికింది.

రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతర కర పదజాలంతో మంత్రి పేర్ని నానిని దూషించడం, మంత్రి కూడా ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఆ నేపథ్యంలో దాదాపు వారంపాటు రాష్ట్రంలో సాగిన ఇరువర్గాల తిట్ల దాడులు చూస్తూనే ఉన్నాం. మొత్తం ఈ వ్యవహారం అంతటికీ మూల కారణం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని రాధాకృష్ణ సూత్రీకరించారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలను మిగిలిన సామాజిక వర్గాల నుంచి వేరు చేయాలనే తన వ్యూహంలో భాగంగానే జగన్ ఇదంతా చేస్తున్నారని రాసేశారు. ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎవర్ని ఎలా తిట్టాలో కూడా తాడేపల్లిలోని ప్యాలెస్ లోనే నిర్ణయం అవుతోందని రాసేసి మనల్ని నమ్మించాలని చూశారు. తుంటి కొడితే పళ్లు రాలినట్టు నాయకుల మధ్య నడచిన మాటల యుద్దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాలకు, జగన్మోహనరెడ్డికి ముడిపెట్టేశారు.

జనంపైనా నిందలు..

రాష్ట్రంలోని యువత మత్తులో జోగుతున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్వ నాశనం అయిపోయినా జనం పట్టించు కోవడం లేదని నిందలు వేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రజలందరూ కులాల కుంపట్లలో చలి కాగుతున్నా రని తప్పంతా వారిదేనని తీర్మానించేశారు.

Also Read : అదే ఆక్రోశం.. మారని పద కోశం..

సినిమా టికెట్లతో మొదలు పెట్టి..

ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్లో సినిమా టికెట్లను అమ్మాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటికే అంధ్రజ్యోతి, ఏబీఎన్ లో ఎంతగానో విషం చిమ్మిన రాధాకృష్ణ ఈ వారం కూడా కొనసాగించారు. అసలు పవన్ కల్యాణ్ ను దెబ్బ కొట్టదానికే ఈ ఆన్ లైన్ టికెట్ల అమ్మకం అంశాన్ని జగన్ తెస్తున్నారని ఊహించేశారు.

మంత్రి పేర్నినాని చెప్పినట్టు గత తొమ్మిదేళ్లలో పవన్ కల్యాణ్ నటించింది ఎనిమిది సినిమాలే. వీటిని అడ్డుకోవడానికి సీఎం స్థాయిలో కుట్ర చేయల్సిన అవసరం ఏముంటుందో రాధాకృష్ణకే తెలియాలి. ప్రజలు దోపిడీకి గురికాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్ లైన్ టికెట్ల అమ్మకం అంశాన్ని పక్క దోవ పట్టించి ఆ క్రెడిట్ జగన్ కు దక్కకుండా చేయాలనే తాపత్రయం తప్ప ఇందులో హేతుబద్దత ఎంత ఉంది? సినిమా టికెట్లను అమ్మగా వచ్చిన సొమ్మును తనఖాగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని తన దివ్య దృష్టిని ఉపయోగించి తెలుసుకున్న విషయాన్ని ఏ మాత్రం దాపరికం లేకుండా మనతో పంచుకున్నారు.

ఇలాంటి రాతలతో తన కురుచ బుద్దిని బయట పెట్టుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు. ఆన్ లైన్ టికెట్ల ఆమ్మకం ద్వారా వచ్చే సొమ్ము ఎప్పటి కప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతున్నా ఈ విషం చిమ్మడం ఎందుకో? ఆసలు నిలకడ లేని సినిమా టికెట్ల అమ్మకంపై వచ్చే ఆదాయం అధారంగా ఎవరైనా అప్పు ఇస్తారా అన్న ఇంగితం లేకుండా ఈ రాతలు ఏమిటో? సినిమా రంగ పెద్దలకు జగన్ ప్రభుత్వంపై అనుమానాలు కలిగించడం కోసమే ఈ పాట్లు పడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి.

Also Read : అవును..నిజమే, ఆంధ్రజ్యోతి కి అన్నీ అలానే కనిపిస్తాయి.!

జనసేనను టీడీపీతో కలిపే యాలని ఆరాటం..

తెర వెనుక మిత్రత్వంతో రాజకీయాలను నడుపుతున్న టీడీపీ, జనసేనలను బహిరంగంగా ఒకటి చేసి తన యజమాని చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలన్న తన ఎజెండాను రాధాకృష్ణ దాచుకోలేదు. బీజేపీతో తెగదెంపులు చేసుకొని తెలుగుదేశంతో పవన్ కల్యాణ్ కలు స్తారని, జనసేన కార్యకర్తలు అదే కోరుకుంటున్నారని తాను కనిపెట్టిన నిజాన్ని రాసేశారు. ఇలా అనేక అంశాలను స్పృశిస్తూ అటు చంద్రబాబు మెప్పు పొందేలా, ఇటు జగన్ పై నిప్పులు కురిసేలా తన కలాన్ని ఆయన కరవాలంలా తిప్పేశారు.

మొన్నటి వరకు మతం ఆధారంగా రాష్ట్రంలో జనం మధ్య చిచ్చు పెట్టాలని చూసిన పచ్చ మీడియా తన రూటు మార్చుకొని ఇప్పుడు కులాల మధ్య అగ్గి రాజెసి అందులో ఆజ్యము పోద్దామని నిర్ణయించుకుందని ఈ రాతల వల్ల అర్థం అవుతోంది. ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేసే ఇలాంటి వారి ఆటలు సాగవు అన్నది ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఎప్పటికి అదే జయిస్తుంది. అది గ్రహించకుండా ఇలాంటి విన్యాసాలు ఎన్ని చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.

Also Read : కులానికి పిలుపునిచ్చిన పవన్‌ కల్యాణ్‌.. అసలు లక్ష్యం ఏమిటి..?