iDreamPost
android-app
ios-app

బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా ‘పుష్ప’

  • Published Apr 08, 2020 | 3:55 AM Updated Updated Apr 08, 2020 | 3:55 AM
  • Published Apr 08, 2020 | 3:55 AMUpdated Apr 08, 2020 | 3:55 AM
బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా ‘పుష్ప’

నిన్న ఐడ్రీం ఉటంకించినట్టుగానే అల్లు అర్జున్ 20కి పుష్ప టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈ కానుక ఇచ్చారు. నిజానికి బన్నీ 19 సినిమాల కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి టైటిల్ పెట్టలేదు. పుష్ప అనేది సౌండింగ్ ప్రకారం అమ్మాయి పేరు. అందులోనూ ఇది హీరోయిన్ రష్మిక మందన్న క్యారెక్టర్ నేమ్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి అల్లు అర్జున్ లాంటి రేంజ్ ఉన్న స్టార్ హీరో ఇలాంటి టైటిల్ ని ఎంచుకోవడం ఆశ్చర్యమే. గతంలో విక్టరీ వెంకటేష్ మాత్రమే ఇలాంటి వి ఎంచుకునేవాడు. లక్ష్మి, తులసి లాంటి పేర్లతో భారీ హిట్లు కొట్టాడు కూడా.

ఇప్పుడు బన్నీ కూడా అదే రూట్ లో వెళ్తున్నట్టు ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న పుష్పలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అడవి బ్యాక్ డ్రాప్ లో రంగస్థలంని మించిన రానెస్ ఇందులో ఉంటుందని ఇప్పటికే ప్రచారం ఉంది. ఇక బన్నీ పుట్టిన రోజుని అభిమానులు సోషల్ మీడియాలో గ్రాండ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. గంగోత్రితో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఫస్ట్ మూవీతోనే హిట్టు కొట్టినా ఆర్యతోనే తన రియల్ టాలెంట్ బయట పడింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

ఒక్కో మెట్టు ఎక్కుతూ ఘన విజయాలు అందుకుంటూ స్టార్ గా ఎదిగిపోయాడు. ఎవరికి సాధ్యం కాని రీతిలో కేరళలో అక్కడి స్టార్ హీరోల మార్కెట్ కు ధీటుగా బన్నీ అక్కడ ఫాలోయింగ్ తెచ్చుకోవడం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. దేశముదురు, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి ఎన్నో హిట్స్ బన్నీ ఖాతాలో ఉన్నాయి. డాన్స్ లోనూ యాక్టింగ్ లోనూ ఎప్పటికప్పుడు పరిణితి చూపిస్తున్న బన్నీ ఇటీవలే అల వైకుంఠపురములో రూపంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని సాధించి పెద్ద గోల్ అందుకున్నారు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప మీద అంచనాలు అప్పుడే ఓ రేంజ్ లో ఉన్నాయి. కరోనా గోల తగ్గాక రెగ్యులర్ షూటింగ్ కొనసాగనుంది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet