iDreamPost
android-app
ios-app

ఉస్తాద్ కోసం సరైన విలన్

  • Published Jul 17, 2021 | 6:04 AM Updated Updated Jul 17, 2021 | 6:04 AM
ఉస్తాద్ కోసం సరైన విలన్

సంక్రాంతికి వచ్చిన రెడ్ తర్వాత దర్శకుడు లింగు స్వామితో కమిట్ అయిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో నిరాటంకంగా సాగుతోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి కానీ యూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. డాక్టర్ గా పోలీస్ గా రామ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని కూడా మరో టాక్ ఉంది. మరి అది డ్యూయల్ రోలా లేక ఒక క్యారెక్టర్ ని అలా డిజైన్ చేశారా అనే క్లారిటీ లేదు.

ఇక కొత్త అప్ డేట్ విషయానికి వస్తే ఇందులో మెయిన్ విలన్ గా ఆది పినిశెట్టి ఎంపికైనట్టు తెలిసింది. సరైనోడు, అజ్ఞాతవాసి, రంగస్థలం, గుడ్ లక్ సఖి ఇలా తెలుగులో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఆది పినిశెట్టికి లింగుస్వామి చెప్పిన కథలో క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఖరారుగా చెప్పలేం. ఆది పినిశెట్టి విలనిజం కూడా బ్రహ్మాండంగా పండించగలడని సరైనోడులో ప్రూవ్ అయ్యింది. తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ రొటీన్ గా చేయకూడదనే ఉద్దేశంతో చాలా మటుకు రిజెక్ట్ చేస్తూ వస్తాడు. ఇప్పుడు ఇది ఓకే అయ్యేలా ఉంది.

లింగుస్వామి దర్శకుడు కావడంతో దీన్ని తమిళ్ లో కూడా భారీ స్కేల్ తో విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ లో ఉంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా లేక 2022కి షిఫ్ట్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ రెడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ అసంతృప్తి తగ్గాలంటే ఇప్పుడీ చిత్రం అంతకు మించి ఆడాలి. అసలే లింగుస్వామి వెనకాల సికందర్, పందెం కోడి 2 రూపంలో పెద్దగా ఆడని సినిమాలు ఉన్నాయి. ఇది పెద్ద హిట్ కావడం తనకూ చాలా అవసరం. ఇందులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందట