iDreamPost
android-app
ios-app

చరిత్రలో తొలిసారిగా నిరాడంబరంగా 74 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

చరిత్రలో తొలిసారిగా నిరాడంబరంగా 74 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

1947 ఆగస్టు 15… 74 సంవత్సరాల క్రితం భారత దేశం కల ఫలించిన రోజు… వందల సంవత్సరాల దాస్య సంకెళ్లకు విముక్తి కలిగించిన రోజు… వ్యాపారం పేరుతో భారత దేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ భారత దేశంలో చిన్న చిన్న రాజ్యాలను అక్రమిస్తూ అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేసింది. కానీ 1857 లో సిపాయిల తిరుగుబాటు మరియు ఝాన్సీ లక్ష్మీబాయ్ సారథ్యంలో కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం కారణంగా భారతదేశంపై అధికారం ఈస్టిండియా కంపెనీ చేతినుండి బ్రిటిష్ రాణి చేతికి మారిపోయింది.

భారత దేశ సంపదను శ్రమను సుమారు 200 ఏళ్లకు పైగా దోచుకున్న బ్రిటిష్ ప్రభుత్వ దాస్యపు చెరనుండి బయట పడటానికి అనేకమంది ఉద్యమకారులు ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడలేదు ఫలితంగా నేడు మనం స్వేచ్చా వాయువులు పీల్చగలుగుతున్నాం.. దేశ స్వతంత్రోద్యమంలో కొందరు హింసాత్మక దారిని ఎంచుకుంటే మరికొందరు అహింసా పోరాటం చేశారు. హింసాత్మకంగా పోరాటం చేసిన వారిలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్ దేవ్ ప్రముఖులు… కానీ హింసాత్మక పోరాటం ద్వారా స్వాతంత్య్రం సాధించలేకపోయారు కాని గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన అహింస పోరాటం దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. గాంధీజీతో పాటు,జవహర్ లాల్ నెహ్రూ,పటేల్, అంబేద్కర్ లాంటి మొదలైనవారు అహింస పోరాటం చేశారు. అనేక ఉద్యమాల ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశానికి 1947 ఆగస్టు14 అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఇచ్చింది.

కాగా ప్రతీ సంవత్సరం అట్టహాసంగా నిర్వహించే స్వతంత్ర్యోద్యమ వేడుకలు చరిత్రలో తొలిసారిగా కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్య్రం ఫలితం.. అలాంటి త్యాగధనులను నిత్యం స్మరించుకుని వారి స్ఫూర్తిని అందిపుచ్చుకుని దేశాన్ని ముందుకు నడపాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది.