iDreamPost
android-app
ios-app

కీర్తి సురేష్ ప్యాన్స్ కు 5 కానుకలు

  • Published Jul 22, 2020 | 12:55 PM Updated Updated Jul 22, 2020 | 12:55 PM
కీర్తి సురేష్ ప్యాన్స్ కు 5 కానుకలు

థియేటర్లు తెరుచుకున్నాక ఏ సినిమాలు ముందు విడుదల అవుతాయో ఎవరూ చెప్పలేరు కానీ ఎవరివి ఎక్కువ రాబోతున్నాయనేది మాత్రం చెప్పొచ్చు. హీరో హీరోయిన్ల లెక్కలో ఎలా చూసుకున్నా ఒకటో రెండో కనిపిస్తాయి కానీ మహానటి కీర్తి సురేష్ వి మాత్రం ఏకంగా ఐదు క్యూలో ఉండటం గమనార్హం. ఇందులో మొదటిది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘మిస్ ఇండియా’. థమన్ రీ రికార్డింగ్ కంపోజ్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఓటిటిలో రావొచ్చని టాక్ ఉంది కానీ నిర్మాతల నుంచి ఎలాంటి సమాచారం లేదు. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. మహేష్ కోనేరు నిర్మాత. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ.

రెండోది ‘గుడ్ లక్ సఖి’. విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ రూపొందిస్తున్న ఈ సినిమా కూడా కీర్తి సురేష్ పాత్రను ఆధారంగా చేసుకుని వస్తున్నదే. ఇదీ రిలీజ్ కూడా రెడీ అవుతోంది. మూడోది మోహన్ లాల్ తో చేసిన భారీ మల్టీ స్టారర్ ‘మరక్కార్’. ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. మల్లువుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మరక్కార్ తెలుగు తమిళ్ లోనూ రాబోతోంది. అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. నాలుగోది నితిన్ తో మొదటిసారి జోడి కట్టిన ‘రంగ్ దే’. ఇంకొంత కీలక భాగం పెండింగ్ ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా బిజినెస్ పరంగా చాలా క్రేజ్ తెచ్చుకుంది.

అయిదోది రజనీకాంత్ తో చేసిన ‘అన్నాతే’. తెలుగు వెర్షన్ టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఇంకో ఇరవై శాతం మాత్రమే బ్యాలన్సు ఉంది. సిరుతై శివ డైరెక్ట్ చేస్తున్న అన్నాతే మీద చాలా హైప్ ఉంది. షూటింగులు స్టార్ట్ అయితే ఇవన్నీ మహా అయితే నాలుగైదు నెలల్లో అన్నీ విడుదల అయిపోతాయి. ఇవి కాకుండా తేజ తీయబోయే అలివేలు వెంకటరమణ, నితిన్ హీరోగా కృష్ణ చైతన్య తీసే పవర్ పేట, రాఘవన్ సీక్వెల్ ఇలా మరో మూడు చర్చల దశలో ఉన్నాయి. పూజా హెగ్డే లాగా గ్లామర్ ఒలకబోయకపోయినా ఇన్నేసి ప్రాజెక్టులు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ రాబోయే ఇంకా బిజీగా మారడం ఖాయం. ఇలా వరస సినిమాలతో పలకరించడం కన్నా అభిమానులకు కావాల్సింది ఏముంటుంది.