iDreamPost
android-app
ios-app

మూడు రాజధానుల – రైతులు ధర్నా

మూడు రాజధానుల –  రైతులు ధర్నా

ఆంధ్రాకు మూడు రాజధానులుంటే తప్పేంటి?అన్న జగన్ ప్రశ్న మీద అనుకూల ,ప్రతి కూల వాదనలు జరుగుతున్నాయి. కొన్ని వర్గాలు మూడు రాజధానులు అవసరం అని వాదిస్తుండగా మరో కొందరు వ్యతిరేకిస్తున్నారు.

మూడు రాజధానుల ఆలోచనకు నిరసనగా ఏ రోజు అమరావతిలో కొందరు రైతులు ధర్నాకు దిగి రోడ్లపై బైఠాయించారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, రాయపూడి, క్రిష్టాయపాలెం, మందడం గ్రామాలకు చెందిన రైతులు ధర్నాకు దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా  పోలీసులు ముందస్తు జాగర్తలు తీసుకున్నారు.

ఈ నిరాహార దీక్షలో భాగంగా రైతులు తమ పిల్లల భవిష్యత్ బాగుంటుంది అని రాజధానికి భూములు ఇచ్చామని తక్షణమే ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని మిరమించుకోవాలని తెలిపారు. ఇదే విధంగా తుళ్ళూరులో ఒక రైతు పురుగుల మందు తాగుతాను అని పురుగుల మందు డబ్బాతో రోడెక్కాడు. రైతుల ధర్నాతో విజయవాడ – అమరావతి రోడ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.