iDreamPost
android-app
ios-app

2021 – పవన్ డబుల్ ట్రీట్ పక్కా

  • Published Jan 27, 2021 | 10:26 AM Updated Updated Jan 27, 2021 | 10:26 AM
2021 – పవన్ డబుల్ ట్రీట్ పక్కా

అజ్ఞాతవాసి తర్వాత ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస చిత్రాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఒకపక్క జనసేన వ్యవహారాలు చూస్తూనే అంతకన్నా ఎక్కువగా షూటింగుల మీద ఫోకస్ పెట్టిన పవర్ స్టార్ వచ్చే ఎన్నికల లోపు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. దానికి తగ్గట్టే ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా షూట్లను ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య వకీల్ సాబ్ పూర్తి చేసిన పవన్ వెంటనే కొద్దిరోజులు క్రిష్ కోసం కేటాయించి మళ్ళీ ఇప్పుడు అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ వైపు వచ్చేశారు. ఇటీవలే దీని షూటింగ్ తాలూకు వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ 2021లో రెండు సినిమాలు విడుదల చేయడం పక్కా. వకీల్ సాబ్ ఏప్రిల్ 2 లేదా 9వ తేదీ రావడం దాదాపు ఖాయమే. దిల్ రాజు ఈ విషయంగా ప్రస్తుతం తన యూనిట్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లతో చర్చల్లో ఉన్నారు. టీజర్ వచ్చాక అంచనాలు పెరగడంతో బిజినెస్ రేంజ్ కూడా హైకు వెళ్ళింది. వంద శాతం సీటింగ్ అనుమతులు అప్పటికంతా వస్తాయనే నమ్మకంతో ఎదురు చూసిన దానికి మంచి ఫలితమే దక్కేలా ఉంది. భారీ ఓపెనింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. సుమారు డెబ్భై నుంచి వంద కోట్ల దాకా బిజినెస్ ని ఆశిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

దీని సంగతలా ఉంచితే అయ్యప్పనం కోశియం రీమేక్ ను కూడా ఇదే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేసేలా ప్రాధమిక ప్లానింగ్ జరిగినట్టు తెలిసింది. ఆ టైంలో పెద్దగా పోటీ లేదు. బాలీవుడ్ నుంచి కూడా నోటెడ్ సినిమాలేవీ ప్లాన్ చేయలేదు. ఒకవేళ సూర్యవంశీ, 83, రాధే లాంటివి ఏవైనా సమ్మర్ లోగా రాకపోతే అప్పుడు ఇవి బరిలో దిగే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాకు బిల్లా రంగా టైటిల్ పరిశీలనలో ఉంది. పవన్ కెరీర్ లో ఇప్పటిదాకా మూడుసార్లు మాత్రమే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజయ్యాయి. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఇది రిపీట్ కావడం అభిమానులకు పండగే కదా.