ఈ నెల 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల తో స్పందన కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు. చిన్నా పెద్ద రహదారుల వద్ద చెక్ పోస్టులు పెట్టి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలు విధించాలని, కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
వరదల వల్ల రిచ్ లు మునిగిపోవడం తో రాష్ట్రలో రోజువారీ డిమాండ్ 80 వేల టన్నులు డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేకపోయామని పేర్కొన్నారు. వారం రోజులుగా పరిస్థితి లో మార్పు వచ్చిందని, ప్రస్తుతం రోజుకు 1.20 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉందని తెలిపారు. వారోత్సవాలు ముగిసే సరికి స్టాక్ పాయింట్లు, రిచ్ ల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వరం రోజుల పాటు అధికారులు ఎవరూ సెలవు పెట్టరాదంటూ ఆదేశించారు.