iDreamPost
android-app
ios-app

లోకేష్, రజినీకాంత్ ‘కూలీ’ మూవీలో నాగార్జున.. వాట్ ఏ కాంబినేషన్

  • Published Apr 22, 2024 | 8:48 PM Updated Updated Apr 22, 2024 | 8:48 PM

లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబోలో వస్తున్న మాస్ మసాలా మూవీ కూలీ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబోలో వస్తున్న మాస్ మసాలా మూవీ కూలీ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లోకేష్, రజినీకాంత్ ‘కూలీ’ మూవీలో నాగార్జున.. వాట్ ఏ కాంబినేషన్

మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలు తోటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేవారు. ఆ తర్వాత పెద్దగా మల్టీస్టారర్ మూవీలు వచ్చింది లేదు. అగ్ర హీరోల సినిమాల్లో స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో మెరిశారే తప్ప ఫుల్ లెంత్ రోల్ లో పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. రీసెంట్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో ఫుల్ లెంత్ లో నటించి సందడి చేశారు. మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందో.. ఇలా స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కానీ రజినీకాంత్, నాగార్జున కాంబోలో భారీ మల్టీస్టారర్ వర్కవుట్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లోనే కావడం విశేషం.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజినీకాంత్ కూలీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నాగార్జున ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివ రాజ్ కుమార్ లు నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తన సినిమాల్లో స్టార్ హీరోలని పెట్టుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలీ సినిమాలో కూడా స్టార్ హీరోలని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగు నుంచి నాగార్జునని తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారట. నాగ్ తో కలిసి నటించేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా రజినీకాంత్ తో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కూలీ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున ధనుష్ తో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్నారు. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించారు. ఇప్పుడు ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నారు. రజినీకాంత్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే కనుక నాగార్జునకి కోలీవుడ్ లో కూడా తిరుగుండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కనకరాజ్ మూవీలో రజినీకాంత్ తో నాగ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ విజువల్ ఫీస్ట్ కే మైండ్ బ్లాక్ అయిపోతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş